వారికి రూ. కోటి పరిహారం చెల్లించండి, ….ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ డిమాండ్..

యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డ్యూటీ సందర్భంగా మరణించిన టీచర్లు, వర్కర్ల కుటుంబాలకు పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వారికి రూ. కోటి పరిహారం చెల్లించండి, ....ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ డిమాండ్..
Priyanka Gandhi
Follow us

| Edited By: Phani CH

Updated on: May 24, 2021 | 1:43 PM

యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డ్యూటీ సందర్భంగా మరణించిన టీచర్లు, వర్కర్ల కుటుంబాలకు పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఆ ఎన్నికల సందర్భంగా 1,621 మంది టీచర్లు మృతి చెందారని, ఆ కుటుంబాల పట్ల ఉదాసీనత తగదని ఆమె ట్వీట్ చేశారు. ప్రభుత్వ అలసత్వానికి ఆ కుటుంబాలు గురి కాకూడదని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించడం ద్వారా వారికి న్యాయం చేకూర్చినట్టవుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఔట్ బ్రేక్ కారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఇంతమంది టీచర్లు, సిబ్బంది మరణించారని ఉత్తరప్రదేశ్ ప్రాథమిక్ శిక్షక్ సంఘ్ అధ్యక్షుడు దినేష్ చంద్ర శర్మ ఇటీవల తెలిపారు. వీరిలో 90 శాతం మంది పంచాయతీ ఎన్నికల ద్యూటీలో ఉన్నారని ఆయన చెప్పారు. అయితే ఈ మరణాలన్నింటినీ ఎన్నికలతో ముడి పెట్టినవిగా భావించలేమని రాష్ట్ర బేసిక్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేదీ అన్నారు. ప్రభుత్వానికి అందిన డేటా ప్రకారం ముగ్గురు టీచర్లు మాత్రమే మరణించారని ఆయన చెప్పారు.

ఇలా ఉండగా ఈ మంత్రి సోదరుడు తనను పేదవాడిగా చెప్పుకుంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సంపాదించాడని వచ్చిన మీడియా రిపోర్టును ప్రియాంక గాంధీ తన ట్వీట్ కి జత చేశారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం అల్లల్లాడుతుంటే దొడ్డిదారిన ఇలా మంత్రులు, వారి బంధువులు ఉద్యోగాలు పొందుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ‘తెలంగాణ రైతు గోస- బీజేపీ పోరు దీక్ష’

‘ఆచార్య’ సినిమా రూమర్స్‏కు చెక్ పెట్టిన డైరెక్టర్.. రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?