Viral: గేదె మృతి.. ఆస్పత్రికి క్యూ కట్టిన 1000 మంది.. ఎందుకే తెలిస్తే షాక్ తింటారు

పిచ్చి కుక్క కరిచి గేదె చనిపోవడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. రేబీస్‌ వ్యాక్సిన్‌ కోసం బారులు తీరారు.

Viral: గేదె మృతి.. ఆస్పత్రికి క్యూ కట్టిన 1000 మంది.. ఎందుకే తెలిస్తే షాక్ తింటారు
Representative image
Follow us

|

Updated on: Mar 27, 2022 | 5:23 PM

పిచ్చి కుక్క కరిచి గేదె చనిపోవడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. రేబీస్‌ వ్యాక్సిన్‌(Rabies Vaccine) కోసం బారులు తీరారు. ఏకంగా ఓ ఊరు ఊరంతా వ్యాక్సిన్‌ కోసం ఎగబడటంతో అక్కడి వైద్యులే విస్తూ పోయారు. దాదాపు 1000 మంది ఆస్పత్రికి చేరుకున్నారు. అసలు ఏం జరిగిందని గ్రామస్తులను ఆరా తీయగా, వారు చెప్పిన కారణం తెలిసి అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)Madhya Pradeshలోని గ్వాలియర్‌(Gwalior) సమీపంలో చోటు చేసుకుంది. అయితే, గేదె చనిపోవడానికి ముందు రోజు దాని పాలతో చేసిన పదార్థాలను గ్రామంలో జరిగిన ఒక మతపరమైన వేడుకల్లో పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని పలువురు ఈ గేదె పాలనే ఇళ్లలో కూడా వినియోగించారు. తర్వాత ఆ గేదె చనిపోయిందని తెలియడంతో గ్రామస్థుల్లో భయం మొదలైంది. తమకు రేబిస్ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనకు గురయ్యారు. భయంతో అంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. జనాలు పెద్ద ఎత్తున హెల్త్ సెంటర్‌కు తరలివెళ్లడంతో.. అక్కడ ఉన్న కొద్దిపాటి రేబీస్ టీకా నిల్వులు అయిపోయాయి.

Also Read: Viral: ఫస్ట్ నైట్ పాలు తాగగానే ఫసక్.. భయ్యా ఇది మాములు యవ్వారం కాదు

Viral: ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..