Gulab Cyclone Breaking: తీరాన్ని తాకిన గులాబ్ తుపాన్.. తీర ప్రాంత ప్రజలకు అలెర్ట్

ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది.  కళింగపట్నంకు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో తుపాన్ తీరాన్ని తాకింది. 

Gulab Cyclone Breaking:  తీరాన్ని తాకిన గులాబ్ తుపాన్.. తీర ప్రాంత ప్రజలకు అలెర్ట్
Cyclone Gulab
Follow us

|

Updated on: Sep 26, 2021 | 7:58 PM

ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది.  కళింగపట్నంకు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో తుపాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమయ్యింది. తుఫాన్ పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. కళింగపట్నం -గోపాలపూర్ మధ్య  తుపాన్ తీరం దాటుతున్నట్లు వివరించింది.  ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 75-95కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తున్నాయని వెల్లడించింది. గాలుల వేగం క్రమంగా 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొందిప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించింది.

తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఈదురుగాలులుతో కూడిన భారీవర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  కలెక్టరేట్ లో తుఫాన్‌పై విపత్తుల నిర్వహణ కమిషనర్ కన్నబాబు రివ్యూ నిర్వహించారు. విద్యుత్ ఆటంకం కలుగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో సగటున 20.2 మిమీ వర్ష పాతం నమోదయ్యింది. పార్వతీపురంలో అత్యధికంగా 33.4 మీ.మీ , పాచిపెంటలో అత్యల్పంగా 5 మీ.మీల వర్షపాతం నమోదయ్యింది.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరంతా  రెండ్రోజుల క్రితం కొత్త బోటు కొనేందుకు ఒడిశా వెళ్లారు  తిరుగుపయనంలో మత్స్యకారుల బోటు తుపానులో చిక్కుకుంది.  మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో మంచినీళ్లపేట గ్రామస్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుఫాన్ ప్రభావంతో  శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా కలెక్టర్ కలెక్టర్ శ్రీకేశ్​ లాఠకర్ సూచించారు.  వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేశారు.

శ్రీకాకుళం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557

ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933

Also Read:  ‘అందరూ శాఖాహారులే… మరి రొయ్యల ముల్లే యాడపోయినట్టు’.. రాత్రయితే రొయ్యలు హాంఫట్

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో యంగ్ హీరో ట్వీట్.. ఇది తన బాధ్యత అన్న యాక్టర్

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.