మావోయిస్టులకు రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఎందుకంటే..?

వారిద్దరు బద్ద శత్రువులే.. అసలు వారు ఎదురెదురు పడితే.. కాల్పుల మోత మొగాల్సిందే. అడవుల్లో వుంటూ.. వారు పోలీసుల కోసం.. పోలీసులు అడవిని జల్లెడ పడుతూ.. వారి కోసం నిత్యం జరిగే సంఘటనలు ఇవి. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగే సంఘటనలు. అయితే శుక్రవారం ఎవరూ ఊహించని ఓ విచిత్ర సంఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నక్సలైట్లకు రక్తదానం చేశారు. అయితే ఇదేంటి.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:29 pm, Fri, 29 May 20
మావోయిస్టులకు రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఎందుకంటే..?

వారిద్దరు బద్ద శత్రువులే.. అసలు వారు ఎదురెదురు పడితే.. కాల్పుల మోత మొగాల్సిందే. అడవుల్లో వుంటూ.. వారు పోలీసుల కోసం.. పోలీసులు అడవిని జల్లెడ పడుతూ.. వారి కోసం నిత్యం జరిగే సంఘటనలు ఇవి. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగే సంఘటనలు. అయితే శుక్రవారం ఎవరూ ఊహించని ఓ విచిత్ర సంఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నక్సలైట్లకు రక్తదానం చేశారు. అయితే ఇదేంటి.. మావోయిస్టులకు రక్తదానం చేయడమేంటని అందరికీ అనుమానం రావొచ్చు. అయితే అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం నాడు.. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తీవ్రంగా గాయపడటంతో.. వారిని జవాన్లు టాటానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. వారికి రక్తం ఎక్కించాలని వైద్యులు పేర్కొనడంతో.. వెంటనే అక్కడి సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాశ్ యాదవ్‌, సందీప్‌ కుమార్‌లు వారికి రక్త దానం చేశారు. అయితే మానవత్వంతోనే ఈ రక్త దానం చేశామని.. మనిషిగా మా బాధ్యత మేము నిర్వర్తించామని సీఆర్పీఎఫ్ జవాన్లు పేర్కొన్నారు.