‘నెగిటివ్’ సర్టిఫికేట్‌‌ ఉంటేనే శబరిమలకు అనుమతి

'నెగిటివ్' సర్టిఫికేట్‌‌ ఉంటేనే శబరిమలకు అనుమతి

కరోనా నేపథ్యంలో ఈసారి శబరిమల యాత్ర ఉంటుందా..? ఉండదా..? అన్న ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. నవంబర్‌ 16 నుంచి శబరిమల దర్శనానికి

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 11, 2020 | 1:40 PM

Sabarimala Yatra to start from November: కరోనా నేపథ్యంలో ఈసారి శబరిమల యాత్ర ఉంటుందా..? ఉండదా..? అన్న ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. నవంబర్‌ 16 నుంచి శబరిమల దర్శనానికి భక్తులను అనుమతించబోతున్నట్లు దేవస్వం మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ వెల్లడించారు. ఇక కోవిడ్‌ 19 నిబంధనలకు అనుగుణంగా ఈ యాత్ర ఉంటుందని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌లు తీసుకురావాలని సూచించారు. అది కూడా ఐసీఎంఆర్‌ గుర్తింపు ఉన్న ల్యాబుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల కోసం సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని, దర్శనానికి వచ్చే భక్తులందరికీ ముందుగానే స్క్రీనింగ్ చేసి, మాస్కులు, శానిటైజర్లు అందిస్తామని అన్నారు. ఇక కొండకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక పంబా, నిలక్కల్‌ మధ్య కేరళ బస్సులను నడుపుతామని వివరించారు. కాగా ఎమర్జెన్సీ నేపథ్యంలో హెలికాఫ్టర్ సర్వీసులు నడపడం మేలని ఈ సందర్భంగా పతనంతిట్ట కలెక్టర్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Read This Story Also: గ్రామానికి ఒకే వినాయక విగ్రహం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu