India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన

India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. సోమవారంతో పోలిస్తే.. మంగళవారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,283 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,11,481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత ఇప్పుడు రికవరీ రేటు భారీగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.33 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,35,763 కి చేరగా.. మరణాల సంఖ్య 4,66,584 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 10,949 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,39,57,698 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 118.44 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24గంటల్లో 76.58 లక్షల డోసులు పంపిణీ చేశారు. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు 63.47 కోట్లకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.


Also Read:

Viral video: కవ్వంతో చిలికిన మేఘాలు ఎప్పుడైనా చూశారా..? అయితే ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. బుధవారం రాశిఫలాలు..

Click on your DTH Provider to Add TV9 Telugu