India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలంటే..?

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలంటే..?
India Coronavirus

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు, మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 396 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,09,940 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 539 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.33 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి తర్వాత ఈ స్థాయికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. డైలీ పాజిటివిటి రేటు 0.79 శాతం ఉంది.  నిన్న కరోనా మహమ్మారి నుంచి 10,264 మంది బాధితులు కోలుకున్నారు.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,44,882 కి చేరగా.. మరణాల సంఖ్య 4,66,980 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,39,67,962 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 119.38 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు 63.59 కోట్లకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Also Read:

Crime News: సహజీవనానికి అడ్డుగా ఉందని తల్లే చంపిందా..? మిస్టరీగా మారిన బాలిక మృతి

Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీటౌన్ సీఐ మృతి.. పెట్రోలింగ్ చేసి..

Click on your DTH Provider to Add TV9 Telugu