India Coronavirus: దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల 20 వేలకు దిగువన నమోదైన కేసులు మళ్లీ 20 వేలకు పైగా నమోదవుతున్నాయి.

India Coronavirus: దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus
Follow us

|

Updated on: Jul 23, 2022 | 9:52 AM

India Covid Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల 20 వేలకు దిగువన నమోదైన కేసులు మళ్లీ 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (శుక్రవారం) కరోనా కేసుల సంఖ్య 21 వేలకుపైగానే నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 21,411 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 67 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,50,100 (0.34 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.46 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.46 శాతం ఉంది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,38,68,476 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,997 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 20,726 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,31,92,379 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 201.68 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 34,93,209 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా నిన్న 4,86,963 మందికి కరోనా పరీక్షలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..