COVID-19: ఆ ఐదు రాష్ట్రాల్లో లక్షన్నర చొప్పున యాక్టివ్ కేసులు.. 13 రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో మరణాలు..

Health Ministry: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తుండటంతో అంతటా

COVID-19: ఆ ఐదు రాష్ట్రాల్లో లక్షన్నర చొప్పున యాక్టివ్ కేసులు.. 13 రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో మరణాలు..
Lav Agarwal
Follow us

|

Updated on: May 05, 2021 | 6:11 PM

Health Ministry: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. దేశంలో ఇటీవల తగ్గిన కేసులు.. మరణాలు.. ఒక్కసారిగా పెరగడం అటు ప్రభుత్వంలో.. ఇటు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయని వెల్లడించారు. మ‌హారాష్ర్ట‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్, ప‌శ్చిమ బెంగాల్, బీహార్, హ‌ర్యానా రాష్ట్రాల్లో ల‌క్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. మరో 7 రాష్ట్రాల్లో 50 వేల నుంచి ల‌క్ష మ‌ధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. 17 రాష్ట్రాల్లో 50 వేల కంటే త‌క్కువ కేసులు న‌మోదవుతున్నాయని పేర్కొన్నారు. అయితే.. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 1.5 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.

అయితే.. 13 రాష్ట్రాల్లో రోజుకు వంద మంది చొప్పున బాధితులు చ‌నిపోతున్నారన్నారు. మ‌హారాష్ర్ట‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, హ‌ర్యానాలో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. రోజువారీ క‌రోనా కేసులతో పోల్చుకుంటే.. కొత్త కేసుల్లో 2.4 శాతం పెరుగుల ఉందన్నారు. నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా వ‌చ్చాయ‌న్నారు. మ‌హారాష్ర్ట‌లో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయని.. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌క‌పోతే.. వైద్య‌సేవ‌ల నిర్వ‌హ‌ణ మ‌రింత క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదిలాఉంటే.. నగరాల వారీగా బెంగ‌ళూరు, చెన్నైలో క‌రోనా కేసులు ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతున్నాయన్నారు. ఒక్క బెంగ‌ళూరులోనే వారం రోజుల్లో ల‌క్ష‌న్న‌ర పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయన్నారు. బెంగ‌ళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువ‌గా ఉందని.. త‌మిళ‌నాడులో 38 వేల పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని లవ్ అగర్వాల్ తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని వెల్లడించారు. 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతోంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 రాష్ట్రాల్లో 6.71 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.

Also Read:

Supreme Court to Centre: ఆక్సిజన్‌ కొరతపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌.. ముంబైని చూసి నేర్చుకోండంటూ హితవు

Covid-19 third wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదా..? సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ సలహదారు..