Covaxin: కరోనా బాధితులకు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు చాలట: ఐసీఎంఆర్

కరోనా బాధితులు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలని.. అది రెండు డోసులతో సమానంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్..

Covaxin: కరోనా బాధితులకు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు చాలట: ఐసీఎంఆర్
Covaxin
Follow us

|

Updated on: Aug 28, 2021 | 8:22 PM

కరోనా బాధితులు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలని.. అది రెండు డోసులతో సమానంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో కోవాగ్జిన్ టీకాపై పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుంటే వచ్చే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తున్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ఈ అధ్యయనంలో కోసం ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య చెన్నైలోని వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ టీకా వేయించుకున్న హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రక్త నమూనాలను సేకరించారు. వారిలో డోసు తీసుకున్న మొదటి రోజు, అలాగే డే 28, డే 56న SARS-CoV-2 నిర్దిష్ట యాంటీబాడీ ప్రతిస్పందనలను ఎలా ఉన్నాయని పరిశీలించారు.

కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వైరస్ బాధితుల్లో.. అలాగే రెండు డోసులు తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకనివారిలోని యాంటీబాడీల ప్రతిస్పందనలు ఒకేలా ఉన్నాయని తెలిపింది. అయితే ఇవి ప్రాధమిక ఫలితాలు మాత్రమేనని.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త లోకేష్ శర్మ వెల్లడించారు. ఒకవేళ ఇది గనక రుజువైతే రాబోయే కాలంలో కోవాగ్జిన్ టీకా సింగిల్ డోసు సిఫార్సు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

ఇవి చదవండి: