లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు.. ఆ తరువాత..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరమే శ్రీరామరక్ష.. శుభ్రంగా ఉండటమే అత్యుత్తమ మార్గం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతూ వస్తున్నా కొంతమందికి అర్థం కావడం లేదు.

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు.. ఆ తరువాత..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 7:51 AM

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరమే శ్రీరామరక్ష.. శుభ్రంగా ఉండటమే అత్యుత్తమ మార్గం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతూ వస్తున్నా కొంతమందికి అర్థం కావడం లేదు. మిగిలిన వారిని పక్కనపెడితే.. ప్రజాప్రతినిధులే లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

తుమకూర్‌ జిల్లాలోని తురువేకెరె అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మసాలే జయరామ్‌ ఇటీవల తన సొంతూరు ఇదగూర్‌లో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వందల మంది అనుచరులు, అభిమానులు హాజరయ్యారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉండగా.. ఎవ్వరూ సామాజిక దూరం పాటించలేదు. అంతేకాదు వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మాస్క్‌లను ధరించగా.. పలువురు అనుచరులు కేక్‌ను ఆయనకు తినిపించారు. అంతేకాదు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గ్రామస్తులను బిర్యానీని వడ్డించగా.. గుంపులు గుంపులుగా వారు బిర్యానీని తిన్నారు. ఇక ఇదంతా ముగిసిన తరువాత ఎమ్మెల్యే జయరామ్.. కరోనా గురించి మాట్లాడటం విశేషం. కరోనా ఎలా వస్తుందో తెలీదు.. సామాజిక దూరం పాటించడమే ఉత్తమం. వేడి నీళ్లతో మీ చేతులను తరచుగా కడుగుతూ ఉండండి అని ఆయన చెప్పుకురావడం గమనర్హం. కాగా ఎమ్మెల్యే తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా విలయతాండవం చేస్తోన్న క్రమంలో బాధ్యతారాహిత్యంగా ఎమ్మెల్యే ప్రవర్తించారని కామెంట్లు చేస్తున్నారు.

Read This Story Also: వర్మకు కేటీఆర్ అదిరిపోయే కౌంటర్..!