India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..

India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..
India Corona

India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గగా.. మంగళవారం స్వల్పంగా పెరిగింది.

Shaik Madarsaheb

|

Mar 02, 2022 | 9:56 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గగా.. మంగళవారం స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,554 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. నిన్నటికంటే 9శాతం కేసులు పెరిగాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.90 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 85,680 (0.20%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,38,599 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,246 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 14,123 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,38,673 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.60 శాతానికిపైగా ఉంది. వరుసగా 24 రోజుల నుంచి లక్షకు దిగువన కేసుల సంఖ్య నమోదవుతోంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,77,79,92,977 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 8,55,862 మందికి టీకాలను వేశారు. కాగా.. దేశంలో ఇప్పటివరకు దాదాపు 77 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Also Read:

Viral Video: ఇదేందయ్య ఎప్పుడూ చూడలే..! పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: సింహాల మంద మధ్యలో చావుని లెక్కచేయని ఆ వ్యక్తి .. అతని ధైర్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu