Covid Vaccination: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ… కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

Covid Vaccination Drive: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల అంతటా..

Covid Vaccination: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ... కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
Covid Vaccination
Ravi Kiran

|

Apr 01, 2021 | 1:54 PM

Covid Vaccination Drive: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల అంతటా.. గెజిటెడ్ సెలవుల్లోనూ మూడో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కేంద్రాల్లో కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. కాగా, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విస్తరించడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాలు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కేంద్రం లేఖ రాసింది. ఈ మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నారు.

మార్చి 31వ తేదీన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చలు జరిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు సిద్దమైనట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కీలక ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు ఈ డ్రైవ్‌లో ఎక్కువ మందికి టీకా వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కాగా, కేంద్రం ఈ నిర్ణయం టీకా పరిపాలనపై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ సిఫారసు ఆధారంగా తీసుకుంది.

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu