Corona: మన దేశంలో తగ్గుతున్నాయి.. ఆ దేశంలో పెరుగుతున్నాయి.. ఊరట కలిగిస్తున్నా ఆందోళనకరమే

దేశంలో(India) కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొవిడ్(Corona) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి కేసుల సంఖ్య రెండు వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,364 మందికి....

Corona: మన దేశంలో తగ్గుతున్నాయి.. ఆ దేశంలో పెరుగుతున్నాయి.. ఊరట కలిగిస్తున్నా ఆందోళనకరమే
Follow us

|

Updated on: May 19, 2022 | 11:37 AM

దేశంలో(India) కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొవిడ్(Corona) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి కేసుల సంఖ్య రెండు వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,364 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. 4.77 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిన్న 2,582 మంది వైరస్ ను జయించారు. వీరితో కలిసి కరోనా ను జయించిన వారి సంఖ్య 4.25కోట్లకు చేరింది. ఇప్పటి వరకూ 4.31 కోట్ల మంది వైరస్ సోకింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 15,419 (0.04 శాతం)గా ఉంది. నిన్న 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు.

మరోవైపు.. ఉత్తర కొరియాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు వాడాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఔషధాలు, టీకాలు, పరీక్షా సాధానాలు వంటి విషయాల్లో సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే.. గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో కోవిడ్‌ కేసులు లేవని ఉత్తరకొరియా చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సింగిల్ డే కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఉద్ధృతికి అధికారుల అపరిపక్వత, ఆలస్యంగా స్పందించడమే కారణమని అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Chanakya Niti: ఈ ముగ్గురికి సహాయం చేస్తే బాధ తప్ప మరేం ఉండదు.. చాణక్య చెప్పిన షాకింగ్ విషయాలు..!

Vikram: ఇట్స్‌ అఫీషియల్‌.. కమల్‌ సినిమాలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..