రైతుల ట్రాక్టర్ ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే బాధ్యత, సుప్రీంకోర్టు రూలింగ్, కేంద్రానికీ పరోక్ష చురక, 20 న మళ్ళీ విచారణ

ఈ నెల 26 న గణ తంత్ర దినోత్సవం నాడు అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ శాంతి భద్రతల పరిధిలోకి వస్తుందని, అందువల్ల దీనిపై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని..

  • Umakanth Rao
  • Publish Date - 1:08 pm, Mon, 18 January 21
రైతుల ట్రాక్టర్ ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే బాధ్యత, సుప్రీంకోర్టు రూలింగ్, కేంద్రానికీ పరోక్ష చురక, 20 న మళ్ళీ విచారణ

ఈ నెల 26 న గణ తంత్ర దినోత్సవం నాడు అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ శాంతి భద్రతల పరిధిలోకి వస్తుందని, అందువల్ల దీనిపై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని డీల్ చేసే అధికారం కేంద్రానికి కూడా ఉందని పేర్కొంది. నగరంలో ఎవరు ప్రవేశించాలి, ఎవరు కూడదు, ఎవరిని అనుమతించాలన్న విషయాలు పోలీసులే నిర్ణయించాల్సి ఉంటుందని, తాము జోక్యం చేసుకోజాలమని సీజేఐ బాబ్డే అన్నారు. బహుశా మేం జోక్యం చేసుకుంటామని మీరు పొరబడినట్టు ఉన్నారు అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  పోలీస్ చట్టం గురించి మీకు తెలియదా ? మొత్తం బాధ్యతను కోర్టుపై వేయాలని చూస్తున్నారా ? అని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. రామ్ లీలా మైదానంలో ప్రదర్శనకు అనుమతించాలా, వద్దా అన్న విషయంలో పోలీసులే నిర్ణయం తీసుకోవాలని కూడా కోర్టు పేర్కొంది. ఈ నెల 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీని గానీ అన్నదాతల మరే నిరసన కార్యక్రమాలను గానీ నిర్వహించకుండా చూడాలంటూ కేంద్రం ఢిల్లీ పోలీసుల తరఫున కోర్టులో ఇంజంక్షన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.