Kiss: ముద్దు హద్దు దాటుతుందా.. కావాలనే రాద్దాంతం చేస్తున్నారా..? వరుస వివాదాలు దేనికి సంకేతం

మూడు ముద్దులు.. ఆరు వివాదాలు..!! ఇప్పుడిదే దేశవ్యాప్తంగా రచ్చ రేపుతోంది. ఒక తల్లి కూతురుకు ఇచ్చే ముద్దు..., భార్య భర్తకు ఇచ్చే ముద్దు... అలానే.. స్నేహితుడు ఇచ్చే ముద్దు... ఈ ఆత్మీయ ముద్దులపై కూడా వివాదం రేగుతోంది. అనవసర రాద్ధాంతం చెలరేగింది. జోడో యాత్రలో భాగంగా..

Kiss: ముద్దు హద్దు దాటుతుందా.. కావాలనే రాద్దాంతం చేస్తున్నారా..? వరుస వివాదాలు దేనికి సంకేతం
Narender Vaitla

|

Nov 25, 2022 | 9:20 PM

మూడు ముద్దులు.. ఆరు వివాదాలు..!! ఇప్పుడిదే దేశవ్యాప్తంగా రచ్చ రేపుతోంది. ఒక తల్లి కూతురుకు ఇచ్చే ముద్దు…, భార్య భర్తకు ఇచ్చే ముద్దు… అలానే.. స్నేహితుడు ఇచ్చే ముద్దు… ఈ ఆత్మీయ ముద్దులపై కూడా వివాదం రేగుతోంది. అనవసర రాద్ధాంతం చెలరేగింది. జోడో యాత్రలో భాగంగా మహిళా ఎమ్మెల్యేకు రాహుల్ గాంధీ ముద్దు పెట్టడం పెద్ద కాంట్రవర్సీగా మారింది. మధ్యప్రదేశ్‌‌లో కొనసాగుతున్న రాహుల్ యాత్రలో.. రాజస్థాన్‌‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో మాట్లాడుతూ నడుస్తున్న క్రమంలో ఆయన.. ఎమ్మెల్యేను దగ్గరకు తీసుకుని తలపై ఆత్మీయంగా ముద్దుపెట్టారు.

రాహుల్‌ గాంధీ ఆత్మీయంగా ముద్దు పెడితే.. దీనిపై దుమారం చెలరేగింది. ఆమెను కించపరిచేలా బీజేపీ నేత అరుణ్ యాదవ్.. ట్వీట్ చేశారు. దీనికి బెస్ట్ క్యాప్షన్ చెప్పాలంటూ నెటిజన్లను అడిగారు. ఆయన ట్వీట్‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ ట్వీట్‌పై దివ్య మడెర్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఏడు క్యాప్షన్స్ ఇచ్చి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. రాహుల్ గాంధీ తన సంరక్షకుడు, గురువు, అన్నయ్య, దయ కలిగిన నాయకుడు అంటూ ట్వీట్ చేశారు. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది. మీకు కూడా కూతురు, భార్య, తల్లి ఉంటుంది కదా.. అంటూ మండిపడ్డారామె. వ్యక్తిత్వాన్ని కించపరిచడం ఆపాలంటూ విరుచుకుపడ్డారు. ఆమెకు మద్ధతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

మొన్నటికి మొన్న.. కూతురికి లిప్‌ కిస్‌ ఇచ్చిన ఐశ్వర్యరాయ్‌పై కూడా దారుణమైన ట్రోల్‌ చేశారు నెటిజన్స్‌.. తన కూతురు జన్మదినం సందర్భంగా.. ఆరాద్యతో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఐశ్వర్యరాయ్. కూతురు ఆరాధ్యకు ‘లిప్ టు లిప్’ కిస్ ఇస్తూ.. ‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యు ఆరాధ్య’ అని పేర్కొంటూ కుమార్తెతో దిగిన ఓ ఫొటోను ఐశ్వర్య ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో కూతురు ఆరాధ్యకు లిప్ టు లిప్ కిస్ ఇస్తూ కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక తల్లి కూతురుకి ఆప్యాయతతో ఇచ్చిన ముద్దుపై కూడా రచ్చ కొనసాగింది. కూతురుకు అలా ముద్దు ఇవ్వడం ఏంటని.. చెంపపై లేదా నుదుటిపై ఇవ్వడం సంస్కారం అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఇంకొందరైతే.. ఇది తల్లి బిడ్డల ప్రేమకు సంబంధించిన విషయం అని.. ఎక్కడ ముద్దు పెట్టుకుంటే మీకేంటి అంటూ ఐశ్వర్యకు సపోర్టుగా ఇంకొందరు కామెంట్ చేశారు.

ఇదిలా ఉంటే.. భర్తకు ప్రేమతో ఇచ్చే ముద్దుపై రచ్చ నడిచింది. ముంబైలో ఓ సినిమా స్పెషల్‌ ప్రీమియర్‌లో భర్తతో కలసి నటి శ్రియ పాల్గొన్నారు. మీడియాకి భర్తతో కలిసి ఫోజులిచ్చారు. ఈ సమయంలోనే.. తన భర్తకు ప్రేమతో.. లిప్ కిస్ ఇచ్చారు. ప్రేమతో ఇచ్చిన ఈ ముద్దపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. గతంలో కూడా తన భర్తకి బహిరంగంగానే లిప్ కిస్ ఇచ్చారు శ్రియ. తనపై వస్తున్న కామెంట్స్‌పై. శ్రియ స్పందించారు. ”దీంట్లో నన్ను విమర్శించడానికి ఏముందో నాకు అర్ధం కావడం లేదు. నా భర్తని నేను ముద్దు పెట్టుకుంటే తప్పా. నా భర్తకి నేను ముద్దిస్తే అది తప్పేలా అవుతుందో నాకు తెలీదు. ముద్దుని కూడా ఇంత విడ్డురంగా చూసేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. ఎవరేమనుకున్నా నా మనసుకి నచ్చినట్టు నేను ఉంటాను” అని తెలిపారు. ప్రేమను వ్యక్తపరచడానికి… ఇంకొంతమంది పెదాలు, చేతులు, నుదురుపై ముద్దు పెడతారు. కానీ.. ముద్దుకు.. ద్వంద అర్థాలు తీస్తూ… రచ్చ రేపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu