Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.1100 కోట్ల ఖర్చు .. విరాళాలతోనే నిర్మాణం.. ఇది సాధ్యమేనా..?

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుమారు రూ.1100 కోట్ల ఖర్చు అవుతాయనే అంచనాను ఇటీవల రామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే....

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.1100 కోట్ల ఖర్చు .. విరాళాలతోనే నిర్మాణం.. ఇది సాధ్యమేనా..?
Follow us

|

Updated on: Dec 31, 2020 | 7:06 PM

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుమారు రూ.1100 కోట్ల ఖర్చు అవుతాయనే అంచనాను ఇటీవల రామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రామ మందిర నిర్మాణాన్ని విరాళాలతో పూర్తి చేస్తామని విశ్వహిందు పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ డిసెంబర్‌ 16న ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇంతపెద్ద రూపంలో విరాళాలు సాధ్యమేనా…? ట్రస్ట్‌ ప్రణాళికలు ఎలా ఉన్నాయి..? అనే సందేహం వ్యక్తం అవుతోంది.

డబ్బులిస్తారు.. కానీ అవి చందాలు కావు :

ఎవరిని డబ్బులు అడగం.. సమాజమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డబ్బులు ఇస్తుంది. ఇదంతా దేవుడు సృష్టించిన సంపద. దేవునికే ఇవ్వండి అని మేం చెబుతాం అని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెబుతున్నారు. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే వారి కోసం కొన్ని కూపన్లు ముద్రించామని శ్రీరామ క్షేత్ర ట్రస్ట్‌ తెలిపింది. ఎన్నిఇళ్లకు వెళ్లాలనుకుంటున్నామో.. అన్ని కూపన్లు ముద్రిస్తాం. రూ.10, రూ.100, రూ.1000 కూపన్లను ముద్రిస్తాం..ఎవరైనా పది రూపాయలు ఇచ్చిన తీసుకుని రశీదు ఇస్తాం.. తమ తల్లిదండ్రులు ఈ బృహత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారని వారి పిల్లలు ఆనందంగా చెప్పుకోవాలి అని ఆయన అన్నారు. అయితే రామజన్మభూమి చరిత్ర తెలిసిన వారు యువతలో తక్కువ. వారికి ఆ విశేషాలను తెలియజేయడం మన బాధ్యత అని చంపత్‌ రాయ్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను చందాలు అని అనకుండా రామ మందిర నిర్మాణ నిధి సమర్పన ప్రచారం అని పిలుస్తామని చెప్పారు.

విరాళాల సేకరణ ఎప్పుడు మొదలవుతుంది..?

రామ మందిర నిర్మాణ ఖర్చుల కోసం ఓ 4 లక్షల మందితో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వీళ్లంతా ఐదు లక్షలకుపైగా గ్రామాల్లోని 50 కోట్ల ప్రజల వద్దకు తీసుకెళ్తారని, ఇంత పెద్ద కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకెళ్లడం ఇప్పటి వరకు కూడా చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం 2021 జనవరి 14 మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 27 మాఘ పూర్ణిమతో ముగుస్తుంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలు తమతో పాటు రామ మందిర చరిత్ర, ఆలయ చిత్రాలు, కంట్రిబ్యూషన్‌ కూపన్లు తీసుకెళ్తారు. రామ జన్మభూమి చరిత్రను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే కాకుండా అన్ని స్థానిక భాషల్లో ముద్రిస్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సహా రాజకీయ పార్టీల నాయకులందరికీ ఈ ప్రతులను అందిస్తారు అని ఆయన వివరించారు.

ప్రభుత్వం, విదేశాల నుంచి నిధులు తీసుకుంటారా…?

ఆగస్టు 5న అయోధ్యలోని ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. దీంతో ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందా..? అనే సందేహం వ్యక్తం అవుతుంది. అయితే ప్రభుత్వం నుంచి సహకారం మాత్రమే ఆశిస్తున్నామని, నిధులు కాదని చంపత్‌ రాయ్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు వ్యక్తి గతంగా విరాళాలు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. భారత ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన విరాళాలు బ్యాంకులో జమ చేస్తామన్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేటర్‌ ఫ్యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ట్రస్ట్‌ను రిజిస్టర్‌ చేయాలంటే మూడేళ్ల ఆడిట్‌ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ ట్రస్ట్‌ పెట్టి ఏడాది మాత్రమే అయింది. అందువల్ల ఆలయ నిర్మాణానికి విదేశీ విరాళాలను స్వీకరించలేమని కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. విరాళల సేకరణ పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా మందిర రూపు రేఖలపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ పునాదులపై దృష్టి పెడుతున్నారు. అయోధ్యలో భూమికి 60 మీటర్ల అడుగున ఇసుక ఉంది. ఈ ఇసుక నిర్మాణంలో ఉపయోగించే రాళ్ల బరువును ఏ మేరకు మోయగలదో పరిశీలిస్తున్నారు.

Also Read: Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి..? కారణాలు ఇవేనా..? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి..?

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.