Congress: కాంగ్రెస్ లో ఎన్నికల కోలహలం.. నేడే నోటిఫికేషన్.. పోటీలో ఉండేది వీరేనా..

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలహలం మొదలైంది. మరో నెల రోజుల లోపే హస్తం పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరనేది తేలిపోనుంది. అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకోవాలని నిర్ణయించడం, మరోసారి కాంగ్రెస్..

Congress: కాంగ్రెస్ లో ఎన్నికల కోలహలం.. నేడే నోటిఫికేషన్.. పోటీలో ఉండేది వీరేనా..
Congress
Follow us

|

Updated on: Sep 22, 2022 | 7:50 AM

Congress: కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలహలం మొదలైంది. మరో నెల రోజుల లోపే హస్తం పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరనేది తేలిపోనుంది. అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకోవాలని నిర్ణయించడం, మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి వద్దంటూ రాహుల్ గాంధీ భీష్మించుకు కూర్చోవడంతో తొలిసారిగా గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలకనేతల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ సెప్టెంబర్ 22వ తేదీ గురువారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల అవుతుంది. పార్టీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించాలని, అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ అనుమతి అవసరం లేదని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది.  ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుండగా… సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్‌ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్‌ 17వ తేదీన ఓటింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తైన రెండు రోజుల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.

నోటిఫికేషన్ విడుదల కానుండటంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోరుకుంటే అధ్యక్ష పదవికి నామపత్రాలు దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ తెలిపారు. పార్టీ ఇచ్చిన ఏ బాధ్యత అయినా నెరవేర్చుతానని ఇప్పటికే తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీన అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. మరో వైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను యువ నేత రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు కోరుతున్నారు. దీనిలో భాగంగా చాలా రాష్ట్రాలు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాయి.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తుందని… మళ్లీ రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఇదే మంచి సందర్భమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పేర్కొన్నారు. నేతలంతా రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారనేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!