Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక రేసులో ఇద్దరు కాదు ముగ్గురు.. నేను పోటీ చేయకూడదా అంటున్న డిగ్గి రాజా..

ఒకరికి ఒకే పదవి అనే తీర్మానాన్ని ఉదయ్‌పూర్‌లో ఆమోదించారని మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆయన రెండు స్థానాల్లో ఎలా ఉండగలరు..? అంటూ..

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక రేసులో ఇద్దరు కాదు ముగ్గురు.. నేను పోటీ చేయకూడదా అంటున్న  డిగ్గి రాజా..
Congress President Poll
Follow us

|

Updated on: Sep 21, 2022 | 9:23 PM

కాంగ్రెస్ ఇండియా జోడో యాత్ర మధ్యలో ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి పదవి రేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసి రెండు గంటలకు పైగా చర్చించారు. ఢిల్లీకి రాకముందు, తాను ఒక్కటే కాదు.. మూడు పదవులనూ కూడా సమర్థంగా నిర్వహించగలనని సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎ‍న్నికైనా.. రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇదే అంశంపై దిగ్విజయ్ దీనిపైనే స్పందిస్తూ ఒక్కరికి ఒకే పదవి అని తేల్చి చెప్పారు. గెహ్లాట్ కోరికను పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.   

గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సూచించారు. ఒకరికి ఒకే పదవి అనే తీర్మానాన్ని ఉదయ్‌పూర్‌లో ఆమోదించారని మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆయన రెండు స్థానాల్లో ఎలా ఉండగలరు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పోటీలో ఉండొచ్చని అన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని పార్టీ బలవంతం చేయవద్దన్నారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు.

దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సూచన ప్రాయంగా తెలిపారు. అశోక్ గెహ్లాట్ పోటీపై పార్టీలోనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్‌కు ఈ రాజకీయ మార్గం అంత సులభం కాదని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం 

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..