CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు.. గులాం బాటలోనే ఆనంద్ శర్మ? అనివార్యం కానున్న అధ్యక్ష ఎన్నిక వాయిదా!

అసలే పరిస్థితి బాగాలేదు.. దాన్ని సరిదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఎంతో కొంత ప్రయత్నిస్తోంది. కానీ పార్టీని వీడే నేతలు మాత్రం తమ పంథా మారదని చాటుతూనే వున్నారు. గత మూడు నెలల్లో ముగ్గురు సీనియర్ నాయకులు..

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు.. గులాం బాటలోనే ఆనంద్ శర్మ? అనివార్యం కానున్న అధ్యక్ష ఎన్నిక వాయిదా!
Congress in Crisis
Follow us

|

Updated on: Aug 27, 2022 | 6:20 PM

CONGRESS PARTY FACING CONTINUOUS SHOCKS: అసలే పరిస్థితి బాగాలేదు.. దాన్ని సరిదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఎంతో కొంత ప్రయత్నిస్తోంది. కానీ పార్టీని వీడే నేతలు మాత్రం తమ పంథా మారదని చాటుతూనే వున్నారు. గత మూడు నెలల్లో ముగ్గురు సీనియర్ నాయకులు.. మరోరకంగా చెప్పాలంటే పార్టీకి ఒకప్పటి మౌత్ పీస్‌లు పార్టీకి షాకిచ్చారు. మొదటి ఇద్దరి మాటెలా వున్నా.. లేటెస్టుగా పార్టీకి గుడ్ బై చెబుతూ ఆయనిచ్చిన షాక్ అయితే అధిష్టానానికి చెంప పెట్టేనని చెప్పాలి. ఎస్.. ఈ ఉపోద్ఘాతమంతా కాంగ్రెస్ పార్టీ గురించే. 2014 దాకా బలమైన నాయకత్వం వున్న పార్టీగా కనిపిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం తాజా పరిణామాలతో మరింత డీలా పడుతున్నట్లు కనిపిస్తోంది. సోనియా గాంధీ(Sonia Gandhi) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 1998 నుంచి 2014 దాకా పార్టీ పకడ్బందీగా కనిపించింది. రెండు దఫాల యూపీఏ పాలనా సమయంలో అయితే, సోనియా కనుసన్నల్లో పార్టీ యంత్రాంగమంతా నడిచింది. ప్రభుత్వంలో తాను స్వయంగా లేకపోయినా సోనియా ఇల్లే కార్యనిర్వాహక కేంద్రంగా కనిపించింది. ప్రధానిగా మన్మోహన్ సింగ్(Manmohan Singh) వున్నా.. 10 జనపథ్‌ని ప్రసన్నం చేసుకునేందుకే పార్టీ నేతలు మొగ్గుచూపేవారు. కానీ 2014 తర్వాత పరిస్థితి మారిపోయింది. 2014లో మోదీ(PM Modi) ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ 50 ఎంపీ స్థానాలను కూడా గెల్వలేకపోయింది. నిజానికి అంతకు ముందు 2012లో జరిగిన యుపీ అసెంబ్లీ ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని చెప్పాలి. ఆ తర్వాత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్టీ అధ్యక్షుడయ్యాక మరింత దిగజారింది పార్టీ పరిస్థితి. ఇటీవల కాలంలో ఇదే పంథా కొనసాగుతుండగా.. తాజాగా మూడు నెలల క్రితం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించకపోవడంతో సీనియర్ నేత, చాన్నాళ్ళు పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గాను, న్యాయకోవిదునిగాను వున్న కపిల్ సిబల్(Kapil Sibal) పార్టీని వీడారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత వంతు మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ (Anand Sharma)దే అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆయన్ను త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఇంఛార్జిగా నియమిస్తే ఆయన ఆ పదవీ బాధ్యతలను చేపట్టేందుకు నిరాకరించారు. దాంతో ఆనంద్ శర్మ పార్టీని వీడడం ఖాయమని అంతా అనుకుంటుండగానే గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) ముందుగా పార్టీకి షాకిచ్చారు. ఆనంద్ శర్మ కంటే ముందుగానే కశ్మీర్(Kashmir) ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టేందుకు ఆజాద్ నిరాకరించారు. కానీ ఆయన ఇంత తొందరగా పార్టీని వీడతారని ఎవరు ఊహించలేదు. సడన్‌గా ఆగస్టు 26వ తేదీన గులాం నబీ ఆజాద్ అయిదు పేజీల సుదీర్ఘ లేఖతో తెరమీదికి వచ్చారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతల్లోకి ఎంటరైన నుంచి పార్టీలో అంతర్గతంగా చాలా మార్పులొచ్చాయని, రాహుల్ కోటరీ చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయిందని సోనియా గాంధీనుద్దేశించి రాసిన లేఖలో ఆజాద్ పేర్కొన్నారు. పార్టీలో నెలకొంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆజాద్ తాను పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులను తన లేఖలో విస్పష్టంగా పేర్కొన్నారు. శతాధిక సంవత్సరాల పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను తనను మనోవేదనకు గురి చేశాయంటూ ఆజాద్ పార్టీని వీడారు. 52 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకోవడం తనకు విషాదంగా వుందన్నారు. అయితే, సహజంగానే ఆజాద్ చర్య వెనుక ప్రధాని నరేంద్ర మోదీ వున్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ, ఆ వాదనలను తోసిపుచ్చిన ఆజాద్ తన సొంత రాష్ట్ర రాజకీయాల్లోకి తనదైన శైలిలో ఎంటరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు లీకేజీలిచ్చారు. కశ్మీర్‌లో తాను సొంత పార్టీ పెట్టుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ సంకేతాలను బలపరస్తూ ఆజాద్ వర్గానికి చెందిన ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. ఈ లెక్కన ఆజాద్ కశ్మీరీ పార్టీ త్వరలోనే పురుడుపోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆజాద్ లాగానే పార్టీ ప్రచార బాధ్యతలను చేపట్టేందుకు వెనుకంజ వేసిన ఆనంద్ శర్మ కూడా త్వరలో పార్టీకి గుడ్ బై చెబుతారని తాజాగా కథనాలు మొదలయ్యాయి.

ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రహసనం ఆగస్టు 21వ తేదీన మొదలైంది. సెప్టెంబర్ 20 నాటికి అధ్యక్ష ఎన్నికల పర్వం పూర్తి కావాల్సి వుంది. రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడు కావాలని నెహ్రూ కుటుంబ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంక వధేరాలతో విదేశాలకు వెళ్ళారు. ఆగస్టు 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. అందులో అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేస్తారని తెలుస్తోంది. కానీ రాహుల్ గాంధీ కాకుండా ఎవరు అధ్యక్షుడైనా పార్టీ గ్రూపుల వారీగా చీలడం ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో రాహుల్ గాంధీని ఒప్పించేందుకు మరికొంత సమయం తీసుకుంటూ అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. నిజానికి రాహుల్ గాంధీ వద్దన్న తర్వాత సోనియా గాంధీ స్వయంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ (Ashok Gehlot)కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. కానీ అశోక్ గెహ్లాట్ కూడా అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అధినేత్రి ఏ బాధ్యత అప్పగించినా సరేనంటూ పైకి చెబుతున్నా.. అంతర్గతంగా తనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. వచ్చ సంవత్సరం రాజస్థాన్ అసెంబ్లీ (Rajastan Assembly)కి ఎన్నికలు జరగబోతున్నాయి. తాను సీఎం సీటును ఖాళీ చేసిన మరుక్షణం దాన్ని అధిష్టించేందుకు సచిన్ పైలట్ (Sachin Pilot) అక్కడ సిద్దంగా వున్నారు. ఒకసారి సీఎం బాధ్యతలు సచిన్ పైలట్ చేతిలోకి చేరితే.. ఇక తనకు రాష్ట్ర రాజకీయాలతో తెగదెంపులేనన్నది అశోక్ గెహ్లట్ భయం. చాలా కాలంగా సచిన్ సీఎం కాకుండా గెహ్లాట్ చక్రం తిప్పుతూనే వున్నారు. అందుకు తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి మరి పార్టీ అధిష్టానాన్ని తనవైపునకు తిప్పుకుంటున్నారు. గెహ్లాట్ వున్నంత కాలం తాను సీఎం కాలేనని భావించిన సచిన్.. ఓ దశలో పార్టీని చీల్చి.. బీజేపీలో చేరడం ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు సిద్దమైనట్లు కథనాలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా సచిన్ పైలట్ ఓర్పుగా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈక్రమంలో తనకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వుండడమే ఇష్టమని భావిస్తున్న గెహ్లాట్ కాసింత గుంభనంగానే వుంటున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఈక్రమంలో అధ్యక్ష ఎన్నికల వాయిదా అనివార్యమేనని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 28న జరగనున్న సీడబ్ల్యూసీ భేటీ, రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చిన జరగనున్న పార్టీ భేటీలే కీలకమని భావిస్తున్నారు.

బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు