అర్నాబ్ గోస్వామి, పార్థో దాస్‌గుప్తా చాట్‌పై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు.. జేపీసీ విచారణ జరపాలని డిమాండ్..

టీఆర్పీ కుంభకోణంలో రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అర్ణబ్ గోస్వామి,

  • uppula Raju
  • Publish Date - 1:08 pm, Mon, 18 January 21
అర్నాబ్ గోస్వామి, పార్థో దాస్‌గుప్తా చాట్‌పై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు.. జేపీసీ విచారణ జరపాలని డిమాండ్..

టీఆర్పీ కుంభకోణంలో రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అర్ణబ్ గోస్వామి, బార్క్ మాజీ హెడ్ పార్థో దాస్‌గుప్తా పాల్గొన్న ‘చాట్‌గేట్’ పై జేపీసీ (జాయింట్ పార్లమెంట్ కమిటీ) విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరిలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్ సంగ‌తి త‌న‌కు ముందే తెలుసున‌ని రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఉద్దేశ పూర్వకంగా బ‌య‌ట‌పెట్టారు. బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాతో జ‌రిగిన వాట్సాప్ చాటింగ్‌లో గోస్వామి వెల్లడించిన‌ట్లు తెలుస్తోంది.

సున్నిత‌మైన స‌మాచారాన్ని వాట్సాప్ చాట్‌లో లీక్ చేయ‌డం వెనుక అర్నాబ్ గోస్వామి ఉద్దేశాల‌ను విప‌క్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ లీకేజీపై అంత‌ర్గతంగా విచార‌ణ జ‌రుపాల‌ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి మనోజ్ తివారి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. మీడియా చెప్పే విషయం సరైనది అయితే అది బాలకోట్ వైమానిక దాడులకు మరియు 2019 సార్వత్రిక ఎన్నికలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం జాతీయ భద్రతా విషయాలను ఉపయోగించుకుంటారా అంటూ మండిపడ్డారు. దీనిపై జేపీసీ దర్యాప్తు అవసరమన్నారు. మరో నేత చిదంబరం దీనిపై స్పందిస్తూ.. బాలాకోట్ దాడులకు మూడు రోజుల ముందు ఒక జర్నలిస్టుకు విషయం ఎలా తెలుసని రాజ్‌నాధ్ సింగ్ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు. ఎంపీ శశి థరూర్ తీవ్రంగా ట్వీట్ చేస్తూ.. బహిర్గతమైన చాట్లలో విచారణకు అవసరమయ్యే మూడు ఖండించదగిన విషయాలు ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త రథసారథి కోసం మొదలైన అన్వేషణ..