Charanjit Singh Channi: పంజాబ్ కొత్త సీఎంగా చన్నీ ప్రమాణ స్వీకారం.. హాజరైన రాహుల్ గాంధీ

Punjab CM Charanjit Singh Channi: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణస్వీకారం చేయించారు. చన్నీతోపాటు

Charanjit Singh Channi: పంజాబ్ కొత్త సీఎంగా చన్నీ ప్రమాణ స్వీకారం.. హాజరైన రాహుల్ గాంధీ
Charanjit Singh Channi

Punjab CM Charanjit Singh Channi: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణం చేయించారు. చన్నీతోపాటు కాంగ్రెస్ నేతలు సుఖ్జీందర్ ఎస్ రాంధవా, ఓపీ సోని డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రమాణ స్వీకార మోహోత్సవానికి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. చన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ నిలిచారు. చన్నీ పంజాబ్ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చరణ్​జీత్ అంతకుముందు అమరీందర్‌ సింగ్‌ కెబినేట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.

కాగా.. ప్రమాణస్వీకారానికి ముందు సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ కుటుంబసభ్యులతో కలసి ఆయన గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సీఎంకు పలువురు ఘనస్వాగతం పలికారు.


కాగా.. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. ముందు సుఖ్జీందర్‌ సింగ్‌ అని వార్తలు వచ్చినా.. కాసేపటికే చరణ్‌జీత్‌ సింగ్‌ పేరును అధిష్టానం ప్రకటించింది. పలు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Also Read:

KTR Defamation Suit: ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్

JNVST Class-VI admission: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఎప్పుడంటే..?

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu