Prashant Kishor: అదేం దైవహక్కు కాదు.. రాహుల్‌ గాంధీపై ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన వ్యాఖ్యలు..

Prashant Kishor targets Rahul Gandhi: దేశంలో రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు

Prashant Kishor: అదేం దైవహక్కు కాదు.. రాహుల్‌ గాంధీపై ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన వ్యాఖ్యలు..
Prashant Kishor
Follow us

|

Updated on: Dec 02, 2021 | 6:21 PM

Prashant Kishor targets Rahul Gandhi: దేశంలో రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు మారడంతో ప్రశాంత్ కిశోర్ యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ పలు ఆసక్తిక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీకే మరోసారి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్ని పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తూ పీకే ట్విట్‌ చేశారు. పార్టీ నాయకత్వం అనేది దైవ హక్కు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలంటూ పిలుపునిచ్చారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ చాలా ముఖ్యమైనదని కానీ.. ఆ పార్టీ నాయ‌క‌త్వం ఓ వ్యక్తికే చెందిన‌ దైవ హ‌క్కుగా భావిస్తోందని ప్రశాంత్‌ కిషోర్ విమ‌ర్శించారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలం, వేదిక చాలా ముఖ్యమైనది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఓ వ్యక్తికే చెందిన దైవహక్కు కాదు, మరీ ముఖ్యంగా గడచిన పదేళ్లల్లో జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయించాలంటూ ప్రశాంత్‌ కిశోర్‌ ట్విట్‌ చేశారు.

ఇదిలాఉంటే.. నిన్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో భేటి అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎక్కడుందంటూ మమతా ప్రశ్నించారు. యూపీఏ ఉనికిలో లేదని.. ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్‌ మౌనంగా ఉందని.. తాము మాత్రం మౌనంగా ఉండమంటూ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎక్కువగా విదేశాల్లో గడుపుతూ రాజకీయాలు చేయలేరంటూ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన ట్విట్‌.. ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌, గోవా ఎన్నికల నేపథ్యంలో ఈ కామెంట్స్‌ కాంగ్రెస్‌ పార్టీ లాభం కంటే.. ఎక్కువగా నష్టం చేకూర్చేవిగా మారుతాయని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.

Also Read:

Navjot Singh Sidhu: ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సిద్ధూ.. కాంగ్రెస్‌కి ఇక గుడ్ బై చెప్పేయడానికి రెడీ!

Omicron Variant: భారత్‌లోకి ఒమిక్రాన్‌.. బెంగళూరులో రెండు కేసులు నమోదు.. ధ్రువీకరించిన కేంద్రం..