అయోధ్య కార్యక్రమాన్ని వాయిదా వేయాలి, దిగ్విజయ్ సింగ్

అయోధ్యలో ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రధాని మోదీని కోరారు.

అయోధ్య కార్యక్రమాన్ని వాయిదా వేయాలి, దిగ్విజయ్ సింగ్

అయోధ్యలో ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రధాని మోదీని కోరారు. ఈ కరోనా వైరస్ తరుణంలో ఈ ఈవెంట్ ని నిర్వహించడం సముచితం కాదని ఆయన ట్వీట్ చేశారు. యూపీ మంత్రి ఒకరు, ఈ రాష్ట్ర బీజేపీ చీఫ్ తో బాటు భూమిపూజ నిర్వహించే స్వామీజీల్లో కొందరు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని, నిన్నటికి నిన్న హోం మంత్రి అమిత్ షా సైతం కోవిడ్-19 కి గురయ్యారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎంతమందిని మీరు ఆసుపత్రి పాల్జేయాలనుకుంటున్నారని ఆయన  ప్రధానిని ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దీన్ని పరిశీలించి.. అయోధ్య ఈవెంట్ ని వాయిదా వేయాల్సిందిగా మోదీని కోరాలన్నారు.

యోగి ఆదిత్యనాథ్ తో బాటు ప్రధాని సైతం  తమకు తాము క్వారంటైన్ కి వెళ్లాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. 14 రోజుల క్వారంటైన్ సామాన్యులకేనా అన్నారు.   కేవలం మోదీకి అనుకూలమైన రోజని ఈ నెల 5 వతేదీని నిర్ణయించారని ఆయన విమర్శించారు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu