కాంగ్రెస్‌కు కరోనా సోకింది.. సంచలన ఆరోపణలు చేసిన సొంత పార్టీ నేత..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి గెలుపుతో హ్యాట్రిక్ సాధించింది. గతంలో ఆప్ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోవడంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్షలు గుప్పించారు. కాంగ్రెస్‌కు […]

కాంగ్రెస్‌కు కరోనా సోకింది.. సంచలన ఆరోపణలు చేసిన సొంత పార్టీ నేత..!
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 7:59 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి గెలుపుతో హ్యాట్రిక్ సాధించింది. గతంలో ఆప్ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోవడంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్షలు గుప్పించారు. కాంగ్రెస్‌కు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు.. కరోనా వైరస్‌ సోకితే వచ్చే నష్టంలా జరిగాయన్నారు. పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని.. లేకపోతే, రాబోయే పరిణామాల్ని అందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ పుస్తక వేడుకలో పాల్గొన్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు తమను తాము పునరుద్ధరించుకోవాలని.. ప్రజలతో మమేకమవ్వాలంటే పార్టీ కూడా పునరుజ్జీవింపజేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజలకు దూరమవుతామని రమేశ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం అధికారానికి దూరమై ఆరేండ్లు గడిచినప్పటికీ, పార్టీలోని కొందరు నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. తామింకా మంత్రులమే అన్న విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.