భారీ వర్షాలకు కుప్పలా కూలిపోయిన బ్రిడ్జ్

భారీ వర్షాల కారణంగా జమ్మూలో ఓ బ్రిడ్జిలోని  చాలాభాగం కుప్పలా కూలి నీటిలో పడిపోయింది. గడీఘర్ ప్రాంతంలోని తావీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నీరు ఈ వంతెనలో చాలా భాగాన్ని..

భారీ వర్షాలకు కుప్పలా కూలిపోయిన బ్రిడ్జ్
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2020 | 9:09 PM

భారీ వర్షాల కారణంగా జమ్మూలో ఓ బ్రిడ్జిలోని  చాలాభాగం కుప్పలా కూలి నీటిలో పడిపోయింది. గడీఘర్ ప్రాంతంలోని తావీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నీరు ఈ వంతెనలో చాలా భాగాన్ని కోసివేసింది. కాంక్రీట్ భాగమంతా నీటిలో కొట్టుకుపోయింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. నలుగురు రైతులు ఈ చరియల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. రెండో రోజైన బుధవారం కూడా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. మూడు రోజులుగా వర్షాలు ఇక్కడ ముంచెత్తుతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu