College Students Gang War: శివ సినిమాను తలపించిన స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. ఇంజినీరింగ్ కాలేజీలో రచ్చ రచ్చ..

చెన్నైలో గ్యాంగ్‌ వార్‌.. ఇదేదో రౌడీ షీటర్లు, గ్యాంగ్‌ల మధ్య ఫైట్‌ కాదు. చదువుకునేందుకొచ్చిన స్టూడెంట్స్.. వీథి రౌడీల్లా తన్నుకున్నారు. ఒకరిపై మరొకరు బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు.

College Students Gang War: శివ సినిమాను తలపించిన స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. ఇంజినీరింగ్ కాలేజీలో రచ్చ రచ్చ..
Chennai College Students Ga
Follow us

|

Updated on: Nov 28, 2021 | 1:55 PM

Chennai College Students Gang War: చెన్నైలో గ్యాంగ్‌ వార్‌.. ఇదేదో రౌడీ షీటర్లు, గ్యాంగ్‌ల మధ్య ఫైట్‌ కాదు. చదువుకునేందుకొచ్చిన స్టూడెంట్స్.. వీథి రౌడీల్లా తన్నుకున్నారు. ఒకరిపై మరొకరు బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇలా తన్నుకున్నది చెన్నై ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం కాలేజీ విద్యార్థులు. కాలేజీ క్యాంటీన్‌లో రెండు గ్రూపుల మధ్య ఏర్పడ్డ వివాదం చినికి చినికి తుఫానులా మారింది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. తరుముకుంటూ వచ్చి మరీ చితకబాదుకున్నారు. కళాశాల ఆవరణలోని క్యాంటీన్‌లో  ఓ విభాగంలో కొందరు విద్యార్థులు ఉండగా.. అక్కడికి మరో విభాగానికి చెందిన విద్యార్థులు వచ్చారు.. ఓ చిన్న సమస్య రావడంతో  మొదట వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాస్తా తోపులాట మారింది.

ఆ తర్వాత కళాశాల విద్యార్థులు గుంపుగా మారి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది చూసిన కళాశాల అధ్యాపకులు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చర్చల సందర్భంగా వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో ఇరువర్గాలు మళ్లీ దాడికి దిగారు.

కొద్దిసేపటికే కొట్లాట పెద్ద దుమారంగా మారింది. కాలేజీ క్యాంపస్‌లో ఇరువర్గాలు దూసుకెళ్లడంతో క్యాంపస్ రణరంగంలా కనిపించింది. ఇది చూసి కొందరు విద్యార్థులు పరుగులు తీశారు. గుంపులో ఉన్న విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నంలో కళాశాల ప్రొఫెసర్ ఒకరికి స్వల్పంగా గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ ఫైటింగ్ సీన్‌ను కొందరు కాలేజీ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

వైరల్ దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో సత్యమంగళం పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవకు దిగిన విద్యార్థులను వీడియో ఆదారంగా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వారిని పట్టుకుని విచారించడమే కాకుండా విద్యార్థుల గొడవకు కారణమేంటి? పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..