Cobra Commando: మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై ఆపరేషన్‌.. తుపాకీతో కాల్చుకుని కోబ్రా కమాండో ఆత్మహత్య..!

Cobra Commando: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. దేశానికి రక్షణగా ఉండాల్సిన కమాండో ఆత్మహత్యక పాల్పడ్డాడు. సుక్మా జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో..

  • Subhash Goud
  • Publish Date - 3:23 pm, Fri, 15 January 21
Cobra Commando: మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై ఆపరేషన్‌.. తుపాకీతో కాల్చుకుని కోబ్రా కమాండో ఆత్మహత్య..!

Cobra Commando: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. దేశానికి రక్షణగా ఉండాల్సిన కమాండో ఆత్మహత్యక పాల్పడ్డాడు. సుక్మా జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సీఆర్పీఎఫ్‌ కోబ్రా కమాండో తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 206 కోబ్రా బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ హర్జీత్‌సింగ్‌ (40) గ్రూప్‌తో కలిసి చింతగుఫా పోలీసు స్టేషన్‌ ప్రాంతంలో నక్సల్స్‌ సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్‌ ప్రారంభించారని, ఆ క్రమంలోనే హర్జీత్‌సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుక్మా అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ సునీల్‌ శర్మ తెలిపారు.

అయితే కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిజుల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) టెమెల్వాడా క్యాంప్‌ బెటాలియన్‌ గురువారం రాత్రి మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకుని ఆపరేషన్‌ చేపట్టారు. రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయల్మెట కొండపై ఆకస్మికంగా దాడి జరిపింది. ఈ సమయంలో హర్జీత్‌ సర్వీస్‌ రైఫిల్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని వివరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే హర్జీత్‌సింగ్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని ఆయన తెలిపారు. సర్వీస్‌ రైఫిల్‌ను తప్పుగా గురిపెట్టాడా..? లేక ఆత్మహత్యనా..? అనే విషయంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సునీల్‌ శర్మ పేర్కొన్నారు. కాగా, హర్జీత్‌ సింగ్‌ స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా జిల్లా. సీఆర్పీఎఫ్‌ దక్షిణ బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించేందుకు మోహరించిన గ్రూప్‌లో హర్జీత్‌సింగ్‌ ఉన్నారు.

Also Read: Missing Boy Died: అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి.. మురుగు కాలువలో బాలుడి మృతదేహం..