బెంగాల్ లో సామాజిక వ్యాప్తి దశలో కరోనా వైరస్, మమతా బెనర్జీ ఆందోళన

పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి చేరుకుందని సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పాండమిక్ ని నివారించలేకపోతున్నామని..

బెంగాల్ లో సామాజిక వ్యాప్తి దశలో కరోనా వైరస్, మమతా బెనర్జీ ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2020 | 3:37 PM

పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి చేరుకుందని సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పాండమిక్ ని నివారించలేకపోతున్నామని ఆమె చెప్పారు. హత్రాస్ ఘటనకు నిరసనగా శనివారం కోల్ కతా లో తమ పార్టీ ఆధ్వర్యాన నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కరోనా వైరస్ కి గురై ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెందారని, దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి కారణంగా ఇంకా ఎంతమంది మరణించారో తెలియడంలేదని దీదీ అన్నారు. రాష్ట్రంలో త్వరలో దుర్గామాత ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, కానీ పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలని మమత ప్రశ్నించారు. కరోనా వైరస్ ఉధృతి కారణంగా గత కొన్ని నెలలుగా తాము ఏవిధమైన ర్యాలీలను నిర్వహించలేకపోయామని ఆమె విచారం వ్యక్తం చేశారు.