CJI NV Ramana: మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అత్యవసరం.. సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి. రమణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సర్వోన్న

CJI NV Ramana: మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అత్యవసరం.. సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..
Cji Nv Ramana

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి. రమణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సర్వోన్న న్యాయమూర్తి రమణ పేర్కొన్నారు. ఇది వేల ఏళ్లుగా అణచివేతకు సంబంధించిన సమస్య అంటూ ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి. రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడం అత్యవసరమని.. అలాగే లా కాలేజీల్లో కూడా అనుమతించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నానంటూ పేర్కొన్నారు. కోర్టుల్లో మహిళా న్యాయవాదులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రమణ అన్నారు. న్యాయస్థానాల్లో మహిళా న్యాయవాదులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. దేశంలోని 22 శాతం కోర్టుల్లో మరుగుదొడ్లు లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

జిల్లా స్థాయిల్లో 30 శాతం కంటే తక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉండగా.. హైకోర్టుల్లో 11.5 శాతం కాగా, సుప్రీంకోర్టులో కేవలం 11-12 శాతం మాత్రమే మహిళలు ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు. దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులు ఉండగా.. వారిలో 15 శాతం మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో కేవలం రెండు శాతం మంది ప్రజాప్రతినిధులు మాత్రమే మహిళలని.. జాతీయ బార్‌ కౌన్సిల్‌ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా ఎందుకు లేరనే అంశాన్ని తాను ప్రశ్నిస్తున్నానని సీజేఐ రమణ వ్యాఖ్యానించారు.

దసరా అనంతరమే కోర్టుల్లో ప్రత్యక్ష విచారణకు అనుమతిస్తామని సీజేఐ పేర్కొన్నారు. కోర్టులు తెరవడం వల్లనే థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌ వేవ్‌ వచ్చాయని ప్రజలు అనవచ్చని.. అందుకే థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌వేవ్‌లు రాకూడదని ఆశిద్దామంటూ ఎన్వీ రమణ అన్నారు. దసరా అనంతరం ప్రత్యక్ష విచారణకు అనుమతించవచ్చంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఇబ్బంది ఉండదని.. న్యాయవాదులు, ఇతర సిబ్బందికే ఇబ్బందులు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read:

Amit Shah Lunch Meet: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులతో అమిత్ షా ప్రత్యేక లంచ్ మీటింగ్!

Gulab Cyclone: అవసరమైతే కేంద్రం నుంచి సాయం.. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ‘గులాబ్’ పరిస్థితులపై ఆరా..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu