China vs India: మరో వివాదానికి తెరలేపిన చైనా.. ఘాటుగా స్పందించిన భారత్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

China vs India: అరుణాచల్‌ప్రదేశ్‌ విషయంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చైనా. దీనిపై ఘాటుగా స్పందించింది భారత్. ఇంతకు చైనా ఏం చేసింది? భారత్ ఎందుకు సీరియస్‌

China vs India: మరో వివాదానికి తెరలేపిన చైనా.. ఘాటుగా స్పందించిన భారత్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Follow us

|

Updated on: Jan 02, 2022 | 9:25 PM

China vs India: అరుణాచల్‌ప్రదేశ్‌ విషయంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చైనా. దీనిపై ఘాటుగా స్పందించింది భారత్. ఇంతకు చైనా ఏం చేసింది? భారత్ ఎందుకు సీరియస్‌ అయ్యింది? ఈ కథనంలో తెలుసుకుందాం. వివరాల్లోకెళితే.. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌పై ఎప్పటినుంచో కన్నేసింది డ్రాగన్ దేశం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకునే దుశ్చర్యలకు పాల్పడింది. చైనా వక్రబుద్ధికి ఎప్పటికప్పుడు ధీటుగా జవాబిచ్చిన భారత్, అటు అంతర్జాతీయ సమాజం ముందు డ్రాగన్‌ దేశాన్ని దోషింగా నిలబెట్టి ప్రయత్నాలు చేసింది. అయితే, తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చైనా.

భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 15 ప్రాంతాల పేర్లను మార్చింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. వాటికి కొత్తగా చైనీస్ పేర్లను పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా పరిగణిస్తోన్న డ్రాగన్ దేశం, తాజాగా పేర్లను తమ అధికారిక పత్రాల్లో, మ్యాపులలో ఉపయోగించడానికి ప్లాన్‌ చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన సరిహద్దు చట్టం కింద చైనా ఈ పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ చట్టం 2022 జనవరి 1న అమల్లోకి వచ్చింది. ఈ ఇష్యూపై సీరియస్‌ అయ్యింది భారత ప్రభుత్వం. చైనా చర్యను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగంగానే ఉందని, ఇకముందు కూడా అలాగే ఉంటుందని స్పష్టం చేసింది మోదీ సర్కార్. కేవలం పేర్లు మార్చినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇది తొలిసారి కాదని చెప్పారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి. 2017 ఏప్రిల్‌లో కూడా చైనా ఇలాగే చేసిందని చెప్పారాయన.

Also read:

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..