Crime News: నల్లగా ఉన్నావన్నందుకు.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఆ తర్వాత మర్మాంగాన్ని..

అందంగా లేవు.. నల్లగా ఉన్నావంటూ ఓ భర్త.. భార్యను రోజూ ఎగతాళి చేస్తుండేవాడు. అలా భర్త వేధింపులను కొంతకాలం పాటు భరించిన భార్య.. ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది.

Crime News: నల్లగా ఉన్నావన్నందుకు.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఆ తర్వాత మర్మాంగాన్ని..
Crime News
Follow us

|

Updated on: Sep 28, 2022 | 5:50 AM

అందంగా లేవు.. నల్లగా ఉన్నావంటూ ఓ భర్త.. భార్యను రోజూ ఎగతాళి చేస్తుండేవాడు. అలా భర్త వేధింపులను కొంతకాలం పాటు భరించిన భార్య.. ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది. భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. అనంతరం అతడి మర్మాంగాన్నీ సైతం కోసింది. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దుర్గ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలేశ్వర్‌ గ్రామంలో అనంత్‌ (40), సంగీత దంపతులు నివసిస్తున్నారు. అనంత్ సోన్వానీ మొదటి భార్య చనిపోవడంతో సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే.. తరుచూ భర్త.. భార్యను భార్యను అసభ్యంగా పిలిచేవాడని.. నల్లగా ఉన్నావంటూ ఆమెను దూషించేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గతంలో పలుమార్లు గొడవలు సైతం జరిగాయన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సైతం గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య సంగీ.. ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అంతటితో ఆగకుండా ఆమె మర్మాంగాన్ని కూడా నరికినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం.. తెల్లవారుజామున సంగీత.. తన భర్తను ఎవరో హత్య చేశారంటూ గ్రామస్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారించారు. అనంతర భార్యపై అనుమానంతో ప్రశ్నించగా.. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసినట్లు పటాన్ ప్రాంతం పోలీసు అధికారి దేవాన్ష్ రాథోడ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ