కరోనా వేళ.. దండకారణ్యంలో తుపాకుల మోత..

ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణ‌పూర్ జిల్లాలో బుధవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉదయం తూర్పు బస్తర్‌ డివిజన్‌ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేపడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు మందుపాతరలను అమర్చి.. పొదల్లో దాక్కుని కాల్పులకు దిగేందుకు స్కెచ్ వేశారు. అడవుల్లో కూంబింగ్‌ చేపడుతున్న డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ పోలీసులు, స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులను గమనించిన నక్సలైట్లు.. మందుపారత పేల్చి.. తుపాకులతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు.. నక్సలైట్లపైకి ఎదురు కాల్పులకు దిగారు. ఈఘటనలో ఓ నక్సలైట్‌ ప్రాణాలు కోల్పోగా.. […]

కరోనా వేళ.. దండకారణ్యంలో తుపాకుల మోత..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 29, 2020 | 3:05 PM

ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణ‌పూర్ జిల్లాలో బుధవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉదయం తూర్పు బస్తర్‌ డివిజన్‌ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేపడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు మందుపాతరలను అమర్చి.. పొదల్లో దాక్కుని కాల్పులకు దిగేందుకు స్కెచ్ వేశారు. అడవుల్లో కూంబింగ్‌ చేపడుతున్న డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ పోలీసులు, స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులను గమనించిన నక్సలైట్లు.. మందుపారత పేల్చి.. తుపాకులతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు.. నక్సలైట్లపైకి ఎదురు కాల్పులకు దిగారు. ఈఘటనలో ఓ నక్సలైట్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. గాయపడ్డ జవాన్లను వెంటనే హెలికాప్టర్‌లో రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు. మిగతా నక్సలైట్లు.. నదిని దాటి  పారిపోయారని.. ఘటనా స్థలంలో ఓ మహిళా నక్సలైట్‌ మృతదేహంతో పాటు..ఎస్ఎల్ఆర్ రైఫిల్, 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.