అభివృద్ధి ఆకాంక్షించినందుకు.. గ్రామస్థులపై నక్సల్స్ దుశ్చర్య.. 25 మందికి గాయాలు..

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలోని కటేకల్యాన్‌ మండలం.. పర్చేలి గ్రామంలోని స్థానిక ప్రజలపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురు..

  • Tv9 Telugu
  • Publish Date - 7:39 am, Mon, 20 July 20
అభివృద్ధి ఆకాంక్షించినందుకు.. గ్రామస్థులపై నక్సల్స్ దుశ్చర్య.. 25 మందికి గాయాలు..

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలోని కటేకల్యాన్‌ మండలం.. పర్చేలి గ్రామంలోని స్థానిక ప్రజలపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురు మహిళలు, చిన్నారులు కూడా బాధితులుగా ఉన్నారు. ఓ పసికందుకు జన్మనిచ్చిన మహిళపై కూడా దాడికి పాల్పడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నక్సల్‌ గ్రామస్థులపై ఈ దాడికి పాల్పడటానకి గల కారణం ఏంటంటే.. ఇటీవల గ్రామాన్ని ప్రభుత్వాధికారులు సందర్శించారు. అందులో జిల్లా కలెక్టర్‌ కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలో గ్రామస్థులు వారికి కావాల్సిన కనీస సౌకర్యాలతో పాటు.. రోడ్డు కూడా నిర్మించాలని.. అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సాయుధ నక్సల్స్‌ శుక్రవారం నాడు దాడి చేసి.. అభివృద్ధి పనులు చేయాలని కోరినందుకు గ్రామస్తులపై కర్రలతో దాడి చేశారు. అయితే వీరిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి అంబులెన్స్‌ తీసుకెళ్లి.. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎనిమిది మందిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మరో 17 మందికి ప్రాథమిక చికత్స చేసి.. గ్రామానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు.