పలు షరతులతో తెరుచుకోనున్న కోయంబేడు మార్కెట్‌

తమిళనాడులో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన కోయంబేడు మార్కెట్ మళ్లీ తెరుచుకోనుంది. ఈ నెల 28 నుంచి అక్కడ షాపులు తెరిచేందుకు

పలు షరతులతో తెరుచుకోనున్న కోయంబేడు మార్కెట్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 20, 2020 | 6:38 PM

Chennai Koyambedu Market: తమిళనాడులో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన కోయంబేడు మార్కెట్ మళ్లీ తెరుచుకోనుంది. ఈ నెల 28 నుంచి అక్కడ షాపులు తెరిచేందుకు అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఇందులో దాదాపుగా 3వేల వరకు దుకాణాలు ఉండగా.. విడతల వారీగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.తొలి విడతలో 300 దుకాణాలు తెరవనున్నారు.

అయితే ఈ మార్కెట్ కారణంగా దాదాపు 3వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు అంచనా వేశారు. అంతేకాదు ఏపీ నుంచి ఈ మార్కెట్‌కి వెళ్లి వచ్చిన వారు సైతం వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో దీన్ని మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయంగా వేరే చోట చిన్న చిన్న బజార్లను ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి వ్యాపారులు, సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. ఇక మార్కెట్‌కి వచ్చే వారంతా ఈ-కామర్స్ పోర్టల్స్‌కి అలవాటు పడుతున్నారని, దీంతో భవిష్యత్‌లో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం వస్తుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రస్తుతం దాదాపుగా అన్ని తెరుచుకుంటుండగా.. కోయంబేడును తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పటిష్ట నిబంధనలతో విడతల వారీగా మార్కెట్‌ని తెరిచేందుకు అధికారులు అనుమతిని ఇచ్చారు.

Read More:

వాట్సాప్‌లో మరిన్ని అదిరిపోయే ఫీచర్లు.. వివరాలివే

ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదు: ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ వీడియో

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన