IAS Son Suicide: అవినీతి కేసులో అరెస్టైన ఐఏఎస్.. అవమానంతో ఆత్మహత్య చేసుకున్న తనయుడు..

IAS Son Suicide: తండ్రి ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌. అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ఇది కొడుకును తీవ్రంగా కలచివేసింది. ఆ మనస్తాపంతోనే తండ్రి..

IAS Son Suicide: అవినీతి కేసులో అరెస్టైన ఐఏఎస్.. అవమానంతో ఆత్మహత్య చేసుకున్న తనయుడు..
Ias Officer
Shiva Prajapati

|

Jun 26, 2022 | 8:34 AM

IAS Son Suicide: తండ్రి ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌. అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ఇది కొడుకును తీవ్రంగా కలచివేసింది. ఆ మనస్తాపంతోనే తండ్రి తుపాకీ తీసుకుని కాల్చుకున్నాడు తనయుడు. ఈ ఘటన చండీగఢ్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజయ్‌ పొప్లీ – పంజాబ్‌లో 2008 బ్యాచ్‌కి చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి. పొప్లీని అవినీతి కేసులో ఇటీవల పంజాబ్‌ విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నాడు. రిమాండ్‌ గడువు ముగుస్తుండటంతో విజిలెన్స్‌ అధికారులు మరోసారి చండీగఢ్‌లోని పొప్లీ ఇంటికి బయలుదేరారు. విజిలెన్స్‌ బృందం పొప్లీ ఇంటికి చేరుకోగానే గన్‌షాట్స్‌ శబ్దం వినిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా పొప్లీ కొడుకు కార్తీక్‌ నిర్జీవంగా పడి ఉండడాన్ని గమనించారు. కార్తీక్‌ గన్‌తో తలలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఎస్పీ కులదీప్ చాహల్, పోలీసులు పొప్లీ ఇంటికి చేరుకున్నారు.

ఈ విషాద ఘటనతో పొప్లీ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్‌ అధికారులే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని కార్తీక్‌ తల్లి ఆరోపించారు. కార్తీక్‌ వయసు 27 సంవత్సరాలు. తండ్రి అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ కావడంతో కార్తీక్‌ కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడని అధికారులు భావిస్తున్నారు. కార్తీక్‌ ఉపయోగించిన గన్‌ తండ్రి పొప్లీదే. ప్రభుత్వ ప్రాజెక్టులో కమీషన్ డిమాండ్ చేశాడంటూ పొప్లీపై స్థానిక కాంట్రాక్టర్ కొన్నాళ్ల క్రితం యాంటీ కరప్షన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. లంచం డిమాండ్ చేసిన ఫోన్ రికార్డింగ్‌లను కూడా అందజేశాడు. ఈ మేరకు పొప్లీని అరెస్ట్ చేశారు అధికారులు. అనంతరం కోర్టులో హాజరుపరిచి, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపించారు. పొప్లీ ఇంట్లో అక్రమ కేట్రిడ్జ్‌లు దొరకడంతో ఆయుధాల చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu