Diesel Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి ; కేంద్ర ఇంధన శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..

Diesel Petrol Price: దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు.

Diesel Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి ; కేంద్ర ఇంధన శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Feb 25, 2021 | 10:12 PM

Diesel Petrol Price: దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ముడి చమురును సరఫరా చేసే ఆయా దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని ప్రకటించారు. ఫలితంగా వీటి ప్రభావం దేశంలో వినియోగదారులపై పడుతోందన్నారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

కరోనా ఎఫెక్ట్, చమురు ఉత్పత్తి తగ్గడం.. కరోనా ఎఫెక్ట్‌తో చాలా దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాయని మంత్రి తెలిపారు. ఫలితంగా ధరలు కూడా పెంచారని అన్నారు. పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న మన దేశంలోనే సహజంగానే ఆ ధరలు ఎఫెక్ట్ పడుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్లకు రూ. 35,000 కోట్లతో ఉచిత వ్యాక్సిన్ ఇదే సమయంలో వ్యాక్సినేషన్‌పై మాట్లాడిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ప్రభుత్వం ముందు ఉన్న ప్రాధాన సమస్య ప్రజలకు ఆర్థిక స్థితిని మెరుగు పరచడం, ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం అని అన్నారు. ఇక ప్రజల ఆరోగ్య రక్షణపైనా దృష్టిసారించామన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపడేందుకు 35,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా నిరుపేద సీనియర్ సిటిజన్లకు ఉచిత వ్యాక్సిన్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.

అలా చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు సగాని వచ్చేస్తాయి.. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇదిలాఉంటే.. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ కూడా ఇలాంటి అంశాన్నే ప్రస్తావించారు. పెట్రోలియం మంత్రి చేసిన సూచనల ప్రకారం.. జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తీసుకువస్తే వాటి ధరలు సగానికి తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

Also read:

ఆ ఏడు రాష్ట్రాల్లోనే 90శాతం కరోనా కేసులు.. అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో నమోదయ్యాయంటే..?

కుప్పం గడ్డ నుంచి వైసీపీకి బాబు అల్టిమేటం… అన్నింటికీ వడ్డీతో సహా సమాధానం ఇస్తామని వార్నింగ్

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్