Coronavirus: ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లోపాలు ఇవే… గుర్తించిన కేంద్ర నిపుణుల బృందాలు

Covid 19: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి.కరోనా వైరస్‌....

Coronavirus: ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లోపాలు ఇవే... గుర్తించిన కేంద్ర నిపుణుల బృందాలు
Covid 19
Follow us

|

Updated on: Apr 12, 2021 | 12:50 AM

Covid 19: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ రెండో ఉద్ధృతితో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను మూడు రాష్ట్రాలకు పంపింది.గత కొన్నిరోజులుగా మూడు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. ఆయా రాష్ట్రాల్లో వైరస్‌ కట్టడి కాకపోవడంలో వైఫల్యాలను గుర్తించాయి.

దేశంలో కరోనా కట్టడిలోకి రాకపోవడంతో వాటి తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ 50 జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపింది. క్షేత్ర స్థాయిలో పర్యటించిన కేంద్ర బృందాలు.. కొన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ నిర్ధారణ కేంద్రాలు లేకపోవడం, కోవిడ్‌ కంటెయిన్‌మెంట్‌ చర్యలు తీసుకోకపోవడం, ఆరోగ్య సిబ్బంది కొరత తదితర సమస్యలను గుర్తించాయి.

కాగా, వైరస్‌ తీవ్ర ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో దాదాపు 30 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. పలు జిల్లాల్లో కోవిడ్‌ శాంపిళ్లను భారీ స్థాయిలో పరీక్షించాల్సి రావడంతో రిపోర్టులు రావడం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర బృందాలు గుర్తించాయి. వీటికి తోడు స్థానిక ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం కూడా వైరస్‌ వ్యాప్తికి మరో కారణంగా అంచనా వేసింది. ఇక మరికొన్ని జిల్లాల్లో క్రియాశీల కేసులపై పర్యవేక్షణ లేకపోవడం స్పష్టంగా కనిపించినట్లు కేంద్ర బృందాలు నివేదించాయి. ఈ కారణాల వల్లనే కరోనా కేసులను కట్టడి కాలేకపోతోందని నివేదించింది.

ఇక కేసుల్లో మహారాష్ట్ర తర్వాత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్‌ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికిపైగా బ్రిటన్‌ రకానివే ఉన్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి ఇది వరకే ప్రకటించారు. అయినప్పటికీ ఇక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో పాటు కోవిడ్‌ ఆస్పత్రులు కూడా లేవని కేంద్ర బృందాలు గుర్తించాయి. వీటితో తోడు అవసరమైన సంఖ్యలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు లేరని పేర్కొన్నాయి. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా పంజాబ్‌లో మందకోడిగా సాగుతున్నట్లు కేంద్ర బృందాలు గుర్తించాయి. అయితే పంజాబ్‌లో టీకాల కొరత ఉందని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ ఇప్పటికే కేంద్రానికి విన్నవించారు.

ఇక కరోనా కట్టడిలో భాగంగా కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసుకోవడంలో ఛత్తీస్‌గఢ్‌ వెనుకబడి ఉందని కేంద్రం గుర్తించింది. అంతేకాకుండా అక్కడక్కడ ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. అక్కడ కంటైన్‌మెంట్‌ చర్యలు తీసుకునేందుకు ఆటంకం ఏర్పడుతున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు ఇచ్చిన నివేదిక ప్రకారం, కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా బాధితులు.. తాజాగా రాష్ట్రంలో ఎన్నికేసులంటే..

China Vaccine: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు

Maharashtra Threat: తెలంగాణకు ‘మహా’ ముప్పు.. రాకపోకలపై నిఘా లేదు.. బోర్డర్‌లో పరీక్షలు అంతంత మాత్రమే

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??