Modi Government: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఆ ధరలను పెంచబోం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Modi Government: రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలే తీసుకుంటోంది. రైతన్నలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతుల..

Modi Government: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఆ ధరలను పెంచబోం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Follow us

|

Updated on: Oct 10, 2021 | 8:12 AM

Modi Government: రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలే తీసుకుంటోంది. రైతన్నలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతుల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతుండగా, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊరట కలిగించే కీలక ప్రకటన చేసింది. ఫెర్టిలైజర్స్‌ ధరలను పెంచబోమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రటకనతో ఫెర్టిలైజర్ కంపెనీలకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రైతులకు మాత్రం తీపికబురు అని చెప్పుకోవాలి. మందులు, ఎరువుల ధరలు పెరిగే రైతన్నలపై నేరుగానే ప్రతికూల ప్రభావం పడుతుంది. కరోనా మహమ్మారి కాలంలో ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ధరలు పెంచబోమనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల అన్నదాతలకు ఊరట కలిగినట్లయింది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.

అయితే ఫెర్టిలైజర్స్‌ కంపెనీలు చాలా రోజుల నుంచే ఎరువులు, మందుల ధరలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ముడి పదార్థాల ధరలు పెరిగాయని, అందుకే ధరలు పెంచాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందకు భిన్నంగా కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సబ్సిడీ పెంచాలని..

సబ్సిడీ పెంచాలని లేదంటే ధరలు అయినా పెంచాలని ఫెర్టిలైజర్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫెర్టిలైజర్ కంపెనీల డిమాండ్‌ను పక్కన పెట్టేసింది. ఏకంగా ధరలు పెంచడం లేదని ప్రకటన చేసింది. ధరలు పెంపు లేదా సబ్సిడీ పెంపునకు అంగీకరించడం లేదని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!

PM Mudra Yojana: రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండిలా.. పూర్తి వివరాలు..!

టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!