పారిశ్రామికావసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంపై నిషేధం, తక్షణమే ఉత్తర్వుల అమలు

దేశంలో కోవిడ్ క్రైసిస్ దృష్ట్యా, కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అవసరాలకు గానీ, వైద్యేతర (నాన్-మెడికల్) అవసరాలకు గానీ లిక్విడ్ ఆక్సిజన్ ని వినియోగించకుండా నిషేధం విధించింది.

పారిశ్రామికావసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంపై నిషేధం, తక్షణమే ఉత్తర్వుల అమలు
liquid oxygen
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 25, 2021 | 9:09 PM

దేశంలో కోవిడ్ క్రైసిస్ దృష్ట్యా, కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అవసరాలకు గానీ, వైద్యేతర (నాన్-మెడికల్) అవసరాలకు గానీ లిక్విడ్ ఆక్సిజన్ ని వినియోగించకుండా నిషేధం విధించింది. దేశంలోని ఆసుపత్రులు, ముఖ్యంగా ఢిల్లీ లోని పలు  హాస్పిటల్స్  ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి, హోమ్ మంత్రి అమిత్ షా అధ్యకక్షతన జరిగిన  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ఈ ఆదేశాలు తక్షణమే వస్తాయని వివరించాయి. ప్రస్తుత మున్న లిక్విడ్ ఆక్సిజన్ కి కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద తమకు లభించిన అధికారాలను పురస్కరించుకుని ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. లిక్విడ్ ఆక్సిజన్ ని కేవలం వైద్య అవసరాలకు మాత్రమేవాడాలని వీటిలో పేర్కొన్నారు. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తిని చేసే కంపెనీలు తమ ఉత్పాదనను వెంటనే పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

ఈ ఉత్తర్వుల నుంచి ఏ పరిశ్రమనూ మినహాయించే ప్రసక్తి లేదని వివరించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ విధమైన చర్యలు తీసుకోవాలని, తమ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా నడచుకునేట్టు చూడాలని ఈ ఆర్డర్స్ లో సూచించారు. ఆక్సిజన్ లభ్యత విషయంలో కేంద్రం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. కోవిడ్ రోగుల మరణాల సంఖ్యను తగ్గించడానికి  ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీలోని పలు ఆస్పత్రులు వరుసగా నాలుగు రోజులుగా ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Sabbam Hari: మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పైనే చికిత్స.. అభిమానుల్లో ఆందోళన

Corona: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు