‘ మా నోళ్లు నొక్కలేరు … ‘ 180 మంది సెలబ్రిటీల ‘ ఒక్క నోరు ‘ !

దేశంలో జరుగుతున్న మూక దాడులగురించి ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై బీహార్ లో రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీరికి మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా , హిస్టారియన్ రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 49 మంది రాసిన లేఖ రాజద్రోహం ఎలా అవుతుందని వీరు ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోతున్న సామూహిక మూక దాడుల వల్ల […]

' మా నోళ్లు నొక్కలేరు ... ' 180 మంది సెలబ్రిటీల ' ఒక్క నోరు ' !
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 09, 2019 | 5:27 PM

దేశంలో జరుగుతున్న మూక దాడులగురించి ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై బీహార్ లో రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీరికి మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా , హిస్టారియన్ రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 49 మంది రాసిన లేఖ రాజద్రోహం ఎలా అవుతుందని వీరు ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోతున్న సామూహిక మూక దాడుల వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోతోందని, వీటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మణిరత్నం, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనెగల్ వంటి పలువురు ప్రముఖులు నేరుగా మోదీకి గత జులైలో లేఖ రాశారు. అయితే వీరిపై బీహార్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజద్రోహం, పబ్లిక్ న్యూసెన్స్, మత పరమైనభావనలను రెచ్ఛగొడుతున్నారని ఆరోపిస్తూ ఈ సెక్షన్లు నమోదయ్యాయి. కానీ.. బీహార్ పోలీసుల చర్యను ఖండిస్తూ తాజాగా నసీరుద్దీన్ షాతో బాటు అశోక్ వాజ్ పేయి, జెర్సీ పింట్. టీఎం. కృష్ణ తదితరులు లేఖను విడుదల చేశారు. ఈ విధమైన వేధింపులను ఖండిస్తున్నామని, మా సహచరులు రాసిన లేఖలోని ప్రతి ఒక్క అక్షరాన్ని సమర్థిస్తున్నామని వీరన్నారు. ప్రజలను, ప్రముఖులను బాధ పెట్టేందుకు కోర్టులను దుర్వినియోగపరుస్తున్నారని దుయ్యబట్టారు. అయితే బీహార్ పోలీసులు మాత్రం 49 మంది సెలబ్రిటీలపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయడాన్ని తేలిగ్గా పరిగణిస్తున్నారు. తాము ఇంకా కోర్టులో ఈ కేసు తాలూకు ఫైల్ దాఖలు చేయలేదని అంటున్నారు.

అటు-ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ ప్రమేయం లేదని చేతులు దులుపుకుంది. ‘ దీనికి బీజేపీతో గానీ, ప్రభుత్వంతో గానీ సంబంధం లేదు. మోదీ సర్కార్ ప్రతిష్టను దిగజార్చడానికే ఈ ప్రయత్నం ‘ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్చను అణగదొక్కడానికి ప్రభుత్వం చూస్తోందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు కొన్ని స్వార్థ పరశక్తులు ఇలాంటి ప్రచారానికి పూనుకొన్నాయని ఆయన అన్నారు. అటు-తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా మోదీ ప్రభుత్వ చర్యను ఖండించిన సంగతి విదితమే. ఇంతమంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న దారుణ సంఘటనలపై గళమెత్తితే.. దాన్ని రాజద్రోహం అంటూ ప్రముఖులపై కేసులు పెట్టడమేమిటని అనేకమంది సాధారణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. పైగా మంత్రి ప్రకాష్ జవదేకర్.. ‘ కొన్ని స్వార్థపర శక్తులు, తుక్ డే, తుక్ డే గ్యాంగ్ ‘ అంటూ అభివర్ణించడం విడ్డూరం.. ఇలాంటి పదప్రయోగాలను భాషా కోవిదులు సైతం హర్షించడం లేదు. ప్రధానికి లేఖ రాసిన వారిలో ఎంతోమంది ప్రముఖ రచయితలు కూడా ఉన్నారు. కేవలం దేశానికి అప్రదిష్టగా మారిన సామూహిక మూకదాడులను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని కోరడం తప్పా అని వీరు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!