ఒంటరి రాజకీయ పోరాటాలు మాకూ తెలుసు…..శివసేన నేత సంజయ్ రౌత్ గర్జన

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా హెచ్చరిస్తూ...

  • Publish Date - 3:49 pm, Sun, 20 June 21 Edited By: Phani CH
ఒంటరి రాజకీయ పోరాటాలు మాకూ తెలుసు.....శివసేన నేత సంజయ్ రౌత్ గర్జన
Sanjay Raut

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా హెచ్చరిస్తూ…తమ పార్టీ ఒంటరిగా ఎన్నో రాజకీయ పోరాటాలు చేసిందని, అవసరమైతే మళ్ళీ ఒంటరి పోరుకు సై అని అన్నారు. గతంలో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమో, పార్టీ మనుగడ కోసమో పొత్తు విషయాన్నీ ప్రెస్టిజీగా తీసుకున్నామన్నారు. సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా హెచ్చరించారన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటే ప్రజలు చెప్పుతో కొడతారని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా-వాళ్ళు (కాంగ్రెస్ పార్టీ) ఒంటరిగా పోటీ చేస్తే మేం మౌనంగా ఉండాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అయితే వారిని అలాగే చేయనివ్వండి… చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు.

శివసేనతో చేతులు కలపకుండా తాము వచ్చే ఏడాది ముంబైలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ముంబై నగర కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగతాప్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ కూడా ఇలాగే అన్నారు. చివరకు వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. పైగా హైకమాండ్ ఆదేశిస్తే తానే సీఎం అభ్యర్థిని అని కూడా అన్నారు.

ఇలా ఒకరి తరువాత ఒకరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు సంకీర్ణ ప్రభుత్వంలో ఛిచ్చు రేపుతున్నాయి. ఇప్పుడు శివసేన కూడా ఎదురు దాడికి దిగింది. ఇక ఎన్సీపీ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్…. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న సీఎం మమతా బెనర్జీ

Tokyo Olympics: జపాన్ నిబంధనలు చాలా దారుణం: భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రతినిధులు