‘యడ్డీ’ ముంగిట భారీ సవాల్.. బై-పోల్ పరీక్ష నెగ్గేనా ?

కర్నాటకలో ఎట్టకేలకు ఉప ఎన్నికల నగారా మోగింది. మొన్నటి రాజకీయ సంక్షోభంలో పదవులకు అనర్హులైన 17 ఎమ్మెల్యేల వల్ల ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరో రెండు స్థానాలకు కోర్టు కేసుల కారణంగా ఇపుడు ఎన్నికలు నిర్వహించడం లేదని సీఈసీ సీఈవో సంజీవ్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రకటించింది. అదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న […]

‘యడ్డీ’ ముంగిట భారీ సవాల్.. బై-పోల్ పరీక్ష నెగ్గేనా ?
Follow us

|

Updated on: Nov 11, 2019 | 7:49 PM

కర్నాటకలో ఎట్టకేలకు ఉప ఎన్నికల నగారా మోగింది. మొన్నటి రాజకీయ సంక్షోభంలో పదవులకు అనర్హులైన 17 ఎమ్మెల్యేల వల్ల ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరో రెండు స్థానాలకు కోర్టు కేసుల కారణంగా ఇపుడు ఎన్నికలు నిర్వహించడం లేదని సీఈసీ సీఈవో సంజీవ్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రకటించింది. అదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. ఆ సెగ్మెంట్లున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఇదంతా అఫీషియల్.. ఇక అసలు రాజకీయం ఇప్పుడే ప్రారంభమైంది.

ఏడాది కాలంపాటు సాగిన రాజకీయ డ్రామాలో.. నెల రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠ తర్వాత ఎట్టకేలకు బిజెపి నేత యడియూరప్ప సీఎం సీటును అధిరోహించారు. సీఎం సీటును తిరిగి సాధించేందుకు యడియూరప్ప ఎంతగా తంటాలు పడ్డారో.. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఆయన తానేంటో నిరూపించుకునేందుకు అంత కంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్-జెడిఎస్ సర్కార్ కూలిపోయే వరకు ఒక రకంగా వున్న రెబెల్ ఎమ్మెల్యేలతో బిజెపి సంబంధాలు ఆ తర్వాత మరో రూపు సంతరించుకున్నాయి.

2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దాన్ని ఆసరాగా చేసుకున్న కాంగ్రెస్.. ఫలితాలు వెలువడుతుండగానే పట్టుమని 30 సీట్లు కూడా లేని జెడిఎస్ పార్టీకి సీఎం సీటిస్తామంటూ ఆఫర్ ఇచ్చి.. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని బిజెపికి దూరం చేసింది. సీఎం సీటులో కూర్చోవాలని తాపత్రయ పడ్డ.. యడియూరప్పకు కాంగ్రెస్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు.

దాంతో కుమారస్వామి సీఎం అయిన మర్నాటి నుంచి ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్ని మార్గాలను వెతకడం మొదలుపెట్టారు యడియూరప్ప. అయితే.. దక్షిణాదిన విస్తరించేందుకు బిజెపి కుటిల యత్నాలకు పాల్పడుతుందన్న వాదన తప్పని నిరూపించడం ద్వారా మొన్నటి సార్వత్రిక ఎన్నికలల్లో విజయవావకాశాలు దెబ్బతినకుండా వుండేందుకు బిజెపి వ్యూహాత్మకంగా కొంత సమయం తీసుకుంది.

మే, 2019లో సార్వత్రిక ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. కర్నాటక నేతలకు బిజెపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో యడియూరప్ప చక్రం తిప్పడం.. సమారు నెల రోజుల డ్రామాలు, క్యాంపుల తర్వాత కుమార స్వామి రాజీనామా చేసి పదవి నుంచి వైదొలగడంతో.. బిజెపి నేత యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. అయితే.. గత జూలైలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు సమర్పించి, ముంబయిలో క్యాంపు రాజకీయాలు చేసిన 17 మంది కాంగ్రెస్‌–జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై ఆనాటి స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదిలా వుంటే.. యడియూరప్ప సీఎం అయిన తర్వాత తమకు పరోక్షంగా సహకరించిన రెబల్ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడంతో ఇపుడు పరిస్థితి జఠిలమైంది. దాంతో యడియూరప్ప తమకు వేయి కోట్ల రూపాయలను ఆఫర్ చేశారంటూ రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల ఆరోపణలు చేశారు. దానికి తోడు అమిత్ షా డైరెక్షన్‌లోనే ముంబయి క్యాంపు నడిచిందని కూడా వారు ఆరోపించారు. సో.. జులై నెలలో జరిగిన రాజకీయ పరిణామాలే తాజాగా జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

అటు కాంగ్రెస్-జెడిఎస్ నేతలు బిజెపిని దోషిగా నిలబెట్టేందుకు యత్నాలు మొదలుపెట్టారు. ఇటు రెబల్ ఎమ్మెల్యేలు కూడా బిజెపినే టార్గెట్‌గా ఆరోపణలకు పదునెక్కిస్తున్నారు. ఎటు తిరిగి ఇద్దరి ఆరోపణలను తట్టుకుని ఉప ఎన్నికలు జరుగుతున్న సీట్లను గెలుచుకోకపోతే యడియూరప్పకు పదవీగండం పొంచి వుంది. రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురి కావడంతో మిగిలిన సంఖ్యలో మేజిక్ ఫిగర్ చూపించుకుని యడియూరప్ప సీఎం సీటులో కూర్చున్నారు. ఇపుడు ఈ 15 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బిజెపి ఎమ్మెల్యేల సంఖ్య అవసరమైన మేరకు పెరగకపోతే.. యడియూరప్ప సీఎం సీటు నుంచి దిగిపోక తప్పదు..

అటు పొలిటికల్ సవాళ్ళు.. ఇటు నెంబర్ గేమ్‌పై సందిగ్ధ పరిస్థితి వెరసి యడియూరప్ప నెత్తికి ఉప ఎన్నికలు భారంగా మారే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా