Budget 2021: కేంద్ర బడ్జెట్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే..

Budget 2021: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి బడ్జెట్‌ ప్రవేశపెడతారు..? ఏ రంగానికి ఎలా ఉండబోతోంది..

Budget 2021: కేంద్ర బడ్జెట్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 7:54 PM

Budget 2021: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి బడ్జెట్‌ ప్రవేశపెడతారు..? ఏ రంగానికి ఎలా ఉండబోతోంది.. అనే ఉత్కంఠ నెలకొంది. ఇక కేంద్ర బడ్జెట్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్‌ను శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రారంభించారు. పార్లమెంట్‌ సభ్యులతో పాటు సాధారణ ప్రజలు ఈ యాప్‌ ద్వారా బడ్జెట్‌ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే ఈ యాప్‌ అందుబాటులోకి వస్తుంది.

కాగా, ప్రతి ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. శనివారం సాయంత్రం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లో ఈ హల్వా వేడుకను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ హల్వా వేడుక పూర్తి కాగానే బడ్జెట్‌ ప్రతుల ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే కరోనా కారణంగా ఈ సారి బడ్జెట్‌ ప్రతులను గానీ, ఆర్థిక సర్వే ప్రతులను గానీ ముద్రించలేదు. ఆయా ప్రతులను డిజిటల్‌ రూపంలో సభ్యులకు అందజేయనున్నారు. దీంతో బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ రూపంలో చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను హల్వా వేడుక సందర్భంగా ప్రారంభించారు.

Also Read: Budget 2021: బడ్జెట్‌లో ఊరట కల్పించండి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సినీ ప్రతినిధులు