Budget 2021 Analysis: కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా 2021-22 బడ్జెట్, ఓ విశ్లేషణ

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  2021-22 సంవత్సరానికి సోమవారం లోక్ సభకు సమర్పించిన బడ్జెట్.. లోపాయికారీగా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న...

Budget 2021 Analysis: కొన్ని  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా 2021-22 బడ్జెట్, ఓ విశ్లేషణ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2021 | 2:44 PM

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  2021-22 సంవత్సరానికి సోమవారం లోక్ సభకు సమర్పించిన బడ్జెట్.. లోపాయికారీగా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా  సాగిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆయా రాష్ట్రాల వారీగా వస్తే.. తమిళనాడుకి ఈ బడ్జెట్లో రూ. 1.03 లక్షల కోట్లు కేటాయించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ..అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. కేరళలో రోడ్ల నిర్మాణానికి 65 వేల కోట్లు కేటాయించారు. 2016 లో ఈ రాష్ట్రంలో కమలం పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. అస్సాంలో మూడేళ్ళలో రోడ్డు ప్రాజెక్టులకు 34 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ లో 695 కి.మీ. హైవే నిర్మాణానికి 25 వేలకోట్లు కేటాయించారు. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో టీ తోటల్లో పని చేసే కార్మికుల సంక్షేమం  కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్లు కేటాయించారు. 9.5 శాతం  ఉన్న ద్రవ్య లోటు భర్తీకి ఎలాంటి చర్యలు చేపడతారో ఈ బడ్జెట్ లో స్పష్టత లేదు.

ఆరేళ్లలో హెల్త్ కేర్ కి 64,180 కోట్లు, కోవిడ్ వ్యాక్సిన్లకు కేవలం 35 వేల కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రకటించారు గానీ 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వ్యాక్సిన్ల ఖర్చుకు పెట్టే మొత్తం ఇంతేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అర్బల్ క్లీన్ ఇండియా మిషన్ కు 1.41 లక్షల కోట్లు, రోడ్లు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు 1.18 లక్షల కోట్లు వ్యయం చేస్తామన్నారు.  నిజానికి ఈ నిధులు ఏ మూలకూ చాలవు. బీమా రంగానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతామంటే ఇది ప్రైవేటీకరణ దిశగా తీసుకున్న నిర్ణయం మాదిరే కనిపిస్తోంది. ఇందుకు అనువుగా ఇన్స్యూరెన్స్ చట్టాన్ని సవరించనున్నారు.

స్ఠార్టప్ లకు మరో ఏడాది టాక్స్ హాలిడే, హౌసింగ్ ప్రాజెక్టులపై ఈ సౌకర్యం కూడా మరో ఏడాది పొడిగింపు స్వల్ప ఊరట నిచ్ఛే చర్యలే.. ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్  కంపెనీలకు పన్ను మినహాయింపునిచ్చారు. కానీ చిన్న, మధ్యతరగతి వర్గాలకు ఊరట నిచ్చే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచే ఊసే లేదు.  కేవలం 75 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేని చర్యను ప్రకటించారు.

ఇక పరోక్షంగా ధరలు పెరిగేవి, తరిగేవి ఇలా ఉన్నాయి

పెట్రోలుపై లీటరుకు 2.5 రూపాయలు, డీజిల్ పై 4 రూపాయల అగ్రిసెస్ విధించారు. గోల్డ్, సిల్వర్, డోర్ బార్స్ మీద 2.5 శాతం అగ్రి ఇన్ ఫ్రా సెస్ విధించారు. అలాగే ఆల్కహాల్ బెవిరేజీలపై ఈ సెస్సును 100 శాతం,  క్రూడ్ పామ్ ఆయిల్ మీద 17.5 శాతం సెస్ ను విధించారు. ఇవి ఫిబ్రవరి 2 నుంచే అమలు కానున్నాయి.

ఇక అక్టోబరు 1 నాటికి కొత్త కస్టమ్స్ సుంకాలను అమలు చేయనున్నారు. కొన్ని స్టీలు ఉత్పత్తులపై ఏడీడీ, సీవీడీ లను రద్దు చేయగా.. రాగి స్క్రాప్ పై సుంకాలను 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించారు.

తెలంగాణ లో ఎకనామిక్ కారిడార్ నిర్మాణం ఊసు లేకపోగా , ఎన్నారైల డబుల్ టాక్సేషన్ కూడా సేమ్.హైదరాబాద్ లో ఎంఎం ఆర్ టీ , ఏపీలో మెట్రోల  ఊసే ఈ బడ్జెట్ లో లేదు. కొచ్చి మెట్రో కి 1957 కోట్లు కేటాయించారు. బెంగుళూరు, చెన్నై మెట్రోల విస్తరణకు ప్రాధాన్యమిచ్చారు. పరదీప్, కొచ్చి ప్రాంతాలకు  5 ఫిషింగ్ పోర్టులను ‘ఇస్తామని’ హామీ ఇఛ్చారు. రైతు చట్టాలను రద్దు చేయాలని  68 రోజులుగా ఆందోళన చేస్తున్న అన్నదాతల ప్రయోజనాలకు ప్రత్యేకించి ఈ బడ్జెట్లో ఎలాంటి తాయిలాలూ లేవు. .

చివరగా చెప్పవచ్ఛేదేమిటంటే.. ఈ బీజేపీ ప్రభుత్వ  తీరు తనకు ఓ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోందని కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ట్వీట్ ను ఈ సందర్భంగా ప్రస్తావించుకోక తప్పదు..

తన వద్దకు తన వాహనం మరమ్మతులకోసం వచ్చిన ఓ వ్యక్తికి ఓ మెకానిక్ ఏం చెప్పాడంటే.. మీ వాహనానికి బ్రేకులను తను రిపేర్ చేయలేనని, కానీ మీ వాహనం హారన్ ని గట్టిగా మోగేట్టు చేయగలుగుతానని చెప్పాడట.. అలా ఉందీ బడ్జెట్ అని శశిథరూర్ పేర్కొన్నారు.

Read More:Union Budget 2021: 1947 తర్వాత తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్స్ సమావేశాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం. Read More:Breaking: ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..