బ్రేకింగ్.. బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..

కేంద్ర కేబినేట్ మరికాసేపట్లో భేటీ కానుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. బడ్జెట్‌ను మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌.. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11.00 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 10.15 నిమిషాలకు కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో […]

బ్రేకింగ్.. బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..

కేంద్ర కేబినేట్ మరికాసేపట్లో భేటీ కానుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. బడ్జెట్‌ను మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌.. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11.00 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 10.15 నిమిషాలకు కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇక కేబినెట్ భేటీకి ముందే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నిర్మలా సీతారామన్‌ కలిశారు.

రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సమయంలో.. ఎర్రని వస్త్రంతో చుట్టిన పద్దుల బ్యాగ్‌తోనే కలిశారు. గత బడ్జెట్ సమావేశంలో.. సంప్రదాయాన్ని పక్కన బెడుతూ.. బడ్జెట్‌ కాపీలను ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా సేమ్ అదే పద్దతిని కంటిన్యూ చేస్తున్నారు. ఈ బ్యాగ్‌పై బంగారు రంగులో భారత జాతీయ చిహ్నంతో పాటు.. ఆ గుర్తు ముద్రకే తాళం చెవితో బ్యాగును తెరిచే వీలుంటుంది.

Published On - 10:28 am, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu