ఆ రెండు పార్టీలే బీజేపీని గెలిపించాయి.. భారతరత్న అవార్డుతో రుణం తీర్చుకోవాలన్న శివసేన

Sanjay Raut: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(assembly elections) ఫలితాలు వచ్చాయి. పంజాబ్ (Punjab) మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసింది. ముఖ్యంగా దేశ ప్రజల అందరి చూపు ఉత్తరప్రదేశ్

ఆ రెండు పార్టీలే బీజేపీని గెలిపించాయి..  భారతరత్న అవార్డుతో రుణం తీర్చుకోవాలన్న శివసేన
Sanjay Raut
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2022 | 4:31 PM

Sanjay Raut: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(assembly elections) ఫలితాలు వచ్చాయి. పంజాబ్ (Punjab) మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసింది. ముఖ్యంగా దేశ ప్రజల అందరి చూపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలమీదనే ఉన్నాయి. ఇక్కడ బీజేపీ మళ్ళీ గెలిచి వ‌రుస‌గా రెండో సారి సీఎం పీఠాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. అయితే శివ సేన ఎంపీ చేసిన కామెంట్స్  ప్రస్తుతం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్  రాష్ట్రాలలో బిజెపి గెలుపుకు కృషి చేసిన బహుజన్ సమాజ్ పార్టీ , AIMIM లు  కృషి చేశాయని శివసేన నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గోవా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పనితీరును శివసేన అధినేత కొనియాడారు. “బిజెపి గొప్ప విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి. 2 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్‌ రౌత్‌ ఇవ్వాలని తనదైన శైలిలో స్పందించారు.

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో BSP ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోగలిగింది .  AIMIM ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం అక్కడ ఓట్లు చీల్చడానికి మాత్రమే ఆ పార్టీ పనికి వచ్చిందని పలు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ 111 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. తన సంఖ్యను 47 నుండి 111 కు పెంచుకుంది. “మా సీట్లు రెండున్నర రెట్లు , ఓట్ల శాతాన్ని ఒకటిన్నర రెట్లు పెంచినందుకు యుపి ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని  ట్విట్టర్‌లో అఖిలేష్ యాదవ్ చెప్పారు.

Also Read: Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 86, నిఫ్టీ 35 పాయింట్లు అప్..

Anurag Thakur: యూపీ కురుక్షేత్రంలో బీజేపీకి అక్కరకొచ్చిన యువనాయకుడి రాజకీయ చాణక్యత..