షాకింగ్.. బార్డర్‌లో బంగ్లా ఫైరింగ్.. జవాన్ మృతి.. అసలు కథేంటి..?

ఎవరూ ఊహించి ఉండరు. పసికూన బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్విందంటే.. అది కూడా భారత్‌పై. దశాబ్దాలుగా కొనసాగుతున్న శాంతి, సామరస్యాలకు చెక్ పెడుతూ.. ఎవరూ ఊహించని విధంగా భారత్, బంగ్లా బార్డర్లో ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌ దళాలు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్‌కు చెందిన విజయ్‌భాన్‌సింగ్ అనే భారత జవాను ప్రాణాలు కోల్పోగా, మరో బీఎస్ఎఫ్ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని సరిహద్దు వద్ద పెట్రోలింగ్ జరుపుతున్న బీఎస్‌ఎఫ్ టీంపై బంగ్లాదేశ్‌ […]

షాకింగ్.. బార్డర్‌లో బంగ్లా ఫైరింగ్.. జవాన్ మృతి.. అసలు కథేంటి..?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 11:14 AM

ఎవరూ ఊహించి ఉండరు. పసికూన బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్విందంటే.. అది కూడా భారత్‌పై. దశాబ్దాలుగా కొనసాగుతున్న శాంతి, సామరస్యాలకు చెక్ పెడుతూ.. ఎవరూ ఊహించని విధంగా భారత్, బంగ్లా బార్డర్లో ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌ దళాలు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్‌కు చెందిన విజయ్‌భాన్‌సింగ్ అనే భారత జవాను ప్రాణాలు కోల్పోగా, మరో బీఎస్ఎఫ్ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని సరిహద్దు వద్ద పెట్రోలింగ్ జరుపుతున్న బీఎస్‌ఎఫ్ టీంపై బంగ్లాదేశ్‌ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్‌ జవాన్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లా బోర్డర్‌ పోస్ట్‌ వద్ద పద్మానదిలోకి బీఎస్ఎఫ్‌ అనుమతితో ముగ్గురు మత్స్యకారులు చేపల వేటకు వెల్లారు. అయితే వీరిని బంగ్లా ఆర్మీ నిర్భంధించారు. ఆ తర్వాత ఇద్దరిని వదిలేసి.. ఒకర్ని వారి వద్దే బంధీగా ఉంచుకోవడంతో.. ఈ విషయాన్ని తిరిగి వచ్చిన మత్స్య కారులు బీఎస్ఎఫ్ జవాన్లకు తెలిపారు. అయితే ఆ మత్స్యకారుడిని విడిపించేందుకు వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై ఉదయం ముగ్గురు మత్స్యకారులు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పద్మ నదిలో చేపల వేటకు వెళ్లారు. వారిలో ఇద్దరు తిరిగొచ్చి కాక్మరిచార్ వద్ద బీఎస్‌ఎఫ్ పోస్టులో ఉన్న అధికారులను కలిసి.. చేపల వేటకు వెళ్లిన తమ ముగ్గురిని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ పట్టుకున్నారని, ఒకరిని వారి అదుపులోనే ఉంచుకుని తమ ఇద్దరినీ విడిచిపెట్టారని చెప్పారు. అయితే వీరిని విడిపించేందుకు ఉదయం 10.30 గంటల సమయంలో కాక్మరిచార్ అవుట్ పోస్ట్ కమాండర్ మరో అయిదుగురు జవాన్లతో కలిసి బీఎస్‌ఎఫ్ బోటులో వెళ్లారు. పద్మ నదిలోని జల సరిహద్దు వద్ద గస్తీలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్‌ను సంప్రదించారు.

అయితే ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించినా తర్వాత.. భారత మత్స్యకారుడిని బంగ్లా ఆర్మీ విడిచిపెట్టలేదు. అంతేకాదు.. వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లను చుట్టుముట్టడంతో.. అప్రమత్తమైన మన జవాన్లు వెంటనే వెనక్కు వచ్చేయడానికి ప్రయత్నించింది. అయితే అదేసమయంలో బంగ్లా ఆర్మీ.. భారత జవాన్లపై కాల్పులకు దిగింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ్‌భాన్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో కానిస్టేబుల్‌ గాయపడటంతో.. ఆయన్ను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అధికారులకు సమాచారం అందించినట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. అయితే బంగ్లా ఆర్మీ మాత్రం మేము కాల్పులు జరపలేదని.. వాళ్లే జరిపారంటూ తోసిపుచ్చింది. మరి ఈ ఊహించని పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాలి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.