Uttarakhand Landslide: కూలిపోతున్న బ్రిడ్జిని మీరెప్పుడైనా చూశారా? భారీవర్షాలకు వచ్చిన వరదల్లో వంతెన ఎలా కూలిపోతోందో చూడండి!

కళ్ళ ముందే వంతెన కూలిపోవడం ఎప్పుడైనా చూశారా? మామూలుగా సినిమా స్టంట్ సీన్లలో బ్రిడ్జీలు కూలిపోయే దృశ్యాలు చూస్తేనే ఆమ్మో అనిపిస్తుంది. మరి నిజంగా వంతెన కూలిపోతుంటే..

Uttarakhand Landslide: కూలిపోతున్న బ్రిడ్జిని మీరెప్పుడైనా చూశారా? భారీవర్షాలకు వచ్చిన వరదల్లో వంతెన ఎలా కూలిపోతోందో చూడండి!
Heavy Rains
KVD Varma

|

Aug 27, 2021 | 2:19 PM

Uttarakhand Landslide:  కళ్ళ ముందే వంతెన కూలిపోవడం ఎప్పుడైనా చూశారా? మామూలుగా సినిమా స్టంట్ సీన్లలో బ్రిడ్జీలు కూలిపోయే దృశ్యాలు చూస్తేనే ఆమ్మో అనిపిస్తుంది. మరి నిజంగా వంతెన కూలిపోతుంటే.. దానిపైన వాహనాల్లో వెళ్లేవారి పరిస్థితి ఏమవుతుంది? అది తెలియాలంటే ఇది చదవాల్సిందే. మూడు నాలుగు రోజులుగా ఈశాన్య భారతదేశంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా తయారైంది. అక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాణి పోఖారి గ్రామం సమీపంలో డెహ్రాడూన్-రిషికేష్ వంతెన కూలిపోయింది.

అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో ఓ ట్రక్ నీటిలో పడిపోయి తేలుతూ కొట్టుకుని పోయింది. మరి కొన్ని వాహనాలూ నీటిలో పడిపోయాయి. వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒకాయన వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అయింది.

“డెహ్రాడూన్-రిషికేష్ రోడ్‌లోని రాణి పోఖారి వద్ద జఖాన్ నదిపై ఉన్న వంతెనలో కొంత భాగం భారీ వర్షం, బలమైన నీటి ప్రవాహం కారణంగా కూలిపోయింది. దయచేసి పై మార్గాన్ని ఉపయోగించవద్దని..ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాము” అని ఉత్తరాఖండ్ పోలీసులు ఒక ట్వీట్‌లో కోరారు.

గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడడంతో రుషికేష్-దేవప్రయాగ్, రిషికేష్-తెహ్రీ డెహ్రాడూన్-ముస్సోరీ రహదారులు మూసివేసినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వాతావరణం సాధారణమయ్యే వరకు ఈ ప్రాంతాలను నివారించాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. నేషనల్ హైవే 58 కూడా తపోవన్ నుండి మలేత వరకు భారీ వర్షం కారణంగా మూసివేశారు.

ఇక డెహ్రాడూన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మాల్‌దేవ్తా-సహస్త్రధార లింక్ రోడ్ గుంతలు ఏర్పడి నదిలో కలిసిపోయింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలోని లాన్స్‌డౌన్ మరియు జైహరిఖల్ మధ్య లోతైన వాగులో కారు పడిపోవడంతో ఢిల్లీకి చెందిన ఇద్దరు పర్యాటకులు మరణించారు మరియు మరొకరు గాయపడ్డారు.

ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆగస్టు 29 వరకు ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, బాగేశ్వర్ మరియు పితోర్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

రాణి పోఖారి గ్రామం వద్ద కొలిపోతున్న వంతెన దృశ్యం ఈ ట్వీట్‌లో మీరు చూడొచ్చు..

Also Read: రైలు ఎక్కేటప్పుడు టికెట్ నియమాలు చదవండి..! ఇలాంటి పొరపాట్లు చేయకండి.. లేదంటే శిక్షార్హులవుతారు..

Dairy Farm Loans: లాభసాటి వ్యాపారం పాడిపరిశ్రమ.. పశువుల పెంపకంకోసం కేంద్రం భారీగా రుణం.. వివరాల్లోకి వెళ్తే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu