చైనా వస్తువుల బాయ్‌కాట్‌ అన్నది ప్రజల ఆలోచన‌.. ప్రభుత్వం ఏం చెప్పలేదు..

చైనా వస్తువులను బహిష్కరించాలి. స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి. ఇది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న స్లోగన్స్‌.

చైనా వస్తువుల బాయ్‌కాట్‌ అన్నది ప్రజల ఆలోచన‌.. ప్రభుత్వం ఏం చెప్పలేదు..
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 6:14 PM

చైనా వస్తువులను బహిష్కరించాలి. స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి. ఇది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న స్లోగన్స్‌. స్వదేశీ వస్తువుల వాడకం పెంచి.. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఉద్యమాన్ని చేపడుతున్నారు నెటిజన్లు. అయితే దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణ అనేది ప్రజల భావన అని.. దీనిపై ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. అన్ని దేశాలతో తమ ప్రభుత్వం మిత్రత్వాన్నే కోరుకుంటుందని.. అయితే భారత దేశ రక్షణ, సార్వభౌమాధికారం విషయంలో మాత్రం రాజీపడే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇక చైనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుతూ.. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించ లేదని.. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని.. శుక్రవారం నాడు ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ఇదిలావుంటే.. చైనా వస్తు బహిష్కరణ విషయం అధికారికంగా చెప్పన్నప్పటికీ.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలు చూస్తే స్వదేశీవైపు ప్రజలు మొగ్గుచూపాలని సందేశాన్ని ఇచ్చింది. కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటిన్లలో జూన్‌ 1వ తేదీ నుంచి స్వదేశీ వస్తువులు మాత్రమే అందులో లభ్యమవుతాయని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కేంద్ర బలగాలకు సంబంధించిన అన్ని క్యాంటిన్లలో ఇప్పుడు స్వదేశీ వస్తువులే లభ్యమవుతున్నట్లు సమాచారం.